వైసీపీ నేత బైరెడ్డి సిద్దార్ధ రెడ్డిపై కేసు నమోదు

Case Filed Against Byreddy Siddhartha Reddy Following Ministers Complaint
  • మంత్రి టీజీ భరత్ ఫిర్యాదుతో చర్యలు
  • మే 14న ధర్నాలో చేసిన వ్యాఖ్యలే కారణం
  • పరువుకు భంగం కలిగించారని మంత్రి ఆరోపణ
  • కేసును ధ్రువీకరించిన కర్నూలు పోలీసులు
వైసీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, ఆ పార్టీ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై కర్నూలులో కేసు నమోదైంది. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి, కర్నూలు ఎమ్మెల్యే టీజీ భరత్ గుప్తా ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేసినట్లు కర్నూలు త్రీ టౌన్ సీఐ శేషయ్య ధృవీకరించారు.

వివరాల్లోకి వెళ్తే, మే 14వ తేదీన కర్నూలు కలెక్టరేట్ వద్ద వైసీపీ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మంత్రి టీజీ భరత్‌పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. తన వ్యాఖ్యల ద్వారా తన పేరు, పరువుకు భంగం కలిగించడంతో పాటు, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా ప్రయత్నించారని మంత్రి భరత్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

మంత్రి నుంచి అందిన ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
 
Go Back to Shorts
Byreddy Siddhartha Reddy
TG Bharat
YSRCP
Kurnool
Andhra Pradesh Politics
Defamation Case
Kurnool Collectorate
YSRCP Protest
AP Minister
Political News

More Telugu News