అమెరికా సెనేటర్ నోట హైదరాబాద్ చిలుకూరు టెంపుల్ మాట... స్మిత్ వ్యాఖ్యలతో దుమారం

American senator Eric makes disgraceful comments on Chilkur Balaji Temple
  • భారతీయులకు వీసాలు లభించడంపై ఎరిక్‌ స్మిత్‌ అక్కసు
  • చిలుకూరు గుడిని ‘వీసా కార్టెల్‌’ అంటూ దుర్భాషలు
  • అమెరికన్ల ఉద్యోగాలను భారతీయులు పొందుతున్నారంటూ అవగాహనారాహిత్య వ్యాఖ్యలు
అమెరికాలో భారతీయుల ఉద్యోగాలు, వీసాలపై అక్కడి సెనేటర్‌ ఎరిక్‌ స్మిత్‌ అక్కసు వెళ్లగక్కారు. పెద్ద టెక్‌ కంపెనీలు అమెరికా ఉద్యోగులను తొలగించి, వారి స్థానంలో ఇండియన్స్‌ను నియమించుకుంటున్నాయని ఆరోపించారు. హెచ్‌-1బీ, ఎల్‌-1, ఎఫ్‌-1 వీసాల వల్ల అమెరికా మధ్యతరగతి ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారంటూ ‘ఎక్స్‌’ వేదికగా అసంబద్ధమైన ఆరోపణలు చేశారు.

ఈ క్రమంలో హైదరాబాద్‌లోని ప్రసిద్ధ చిలుకూరు బాలాజీ దేవాలయాన్నీ ఎరిక్‌ ప్రస్తావించారు. వీసాల కోసం వేలాది మంది ఇక్కడ ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని గుర్తుచేశారు. పాస్‌పోర్టులకు పూజలు చేయించి మరీ వీసాలు పొందుతున్నారని, దీన్ని ‘వీసా కార్టెల్‌’ వ్యవస్థ అంటూ భక్తుల విశ్వాసాన్ని అవహేళన చేసే ప్రయత్నం చేశారు.

అమెరికన్లు చెల్లించే ట్యాక్స్‌లతో విదేశీ విద్యార్థులకు ఉద్యోగాలు లభిస్తున్నాయంటూ ఎరిక్‌ తన అవగాహనారాహిత్యాన్ని బయట పెట్టుకున్నారు. వీరంతా చదువు పూర్తయ్యాక గ్రీన్‌ కార్డుతో స్థిరపడుతున్నారని అక్కసు వెళ్లగక్కారు. దీనివల్ల అమెరికా గ్రాడ్యుయేట్లు ఉద్యోగాలు పొందలేకపోతున్నారంటూ పొంతనలేని ఆరోపణలు చేశారు. 

ఉద్యోగాల్లో మెరిట్‌ పక్కనపెట్టి ఇండియన్స్‌కే ఉద్యోగాలు ఇస్తున్నారంటూ అక్కడి కంపెనీలపై ఎరిక్‌ మండిపడ్డారు. మరోవైపు ఇంటర్వ్యూ ప్రశ్నలను భారతీయులు ఒకరికొకరు షేర్‌ చేసుకుంటున్నారని చెప్పుకొచ్చారు. సదరన్‌ మెథడిస్ట్‌ యూనివర్సిటీలో అమెరికన్‌ ప్రొఫెసర్‌ను కాదని, భారతీయుడికే ప్రాధాన్యం ఇచ్చారని ఆరోపిస్తూ ఇటీవల కోర్టుకు వెళ్లిన విషయాన్ని గుర్తుచేశారు.
Go Back to Shorts
Eric Schmidt
US Senator
H1B visa
Chilkur Balaji Temple
Hyderabad
Indian professionals
US jobs
visa cartel
immigration
tech companies

More Telugu News