తమిళనాడు సీఎం పదవికి స్టాలిన్ రాజీనామా
- అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే ఘోర పరాజయం
- నటుడు విజయ్ టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరణ
- స్టాలిన్ రాజీనామాను ఆమోదించి ఆపద్ధర్మ సీఎంగా కొనసాగాలని కోరిన గవర్నర్
- సొంత నియోజకవర్గం కొళత్తూరులోనూ ఓటమి పాలైన స్టాలిన్
- ప్రభుత్వ ఏర్పాటుకు మిత్రపక్షాల కోసం టీవీకే అన్వేషణ
తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ తన పదవికి రాజీనామా చేశారు. తమిళనాడు ప్రజల తీర్పును గౌరవిస్తున్నట్టు తెలిపారు. నిన్నటి అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో, దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్న ద్రావిడ పార్టీలకు భారీ షాక్ తగలడం తెలిసిందే. స్టాలిన్ సమర్పించిన రాజీనామా లేఖను తమిళనాడు గవర్నర్ రాజేంద్ర ఆర్లేకర్ మంగళవారం ఆమోదించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడేంత వరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించాలని స్టాలిన్‌ను గవర్నర్ కోరారు.
నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ ఈ ఎన్నికల్లో అనూహ్యమైన విజయం సాధించి, రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చేసింది. మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు గాను టీవీకే 108 సీట్లు గెలుచుకుని ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించింది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ మార్కుకు కేవలం 10 సీట్ల దూరంలో నిలిచింది. మరోవైపు, అధికార డీఎంకే కేవలం 59 స్థానాలకే పరిమితమై తీవ్ర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఈ ఎన్నికల ఫలితాలు రాష్ట్రంలో కొత్త రాజకీయ శకానికి నాంది పలికాయి.
ఈ ఎన్నికల్లో స్టాలిన్‌కు వ్యక్తిగతంగానూ ఊహించని పరాభవం ఎదురైంది. తన కంచుకోటగా భావించే కొళత్తూరు నియోజకవర్గంలో టీవీకే అభ్యర్థి వి.ఎస్. బాబు చేతిలో ఆయన 8,795 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఓట్ల శాతం పరంగా చూస్తే, టీవీకే 32 శాతానికి పైగా ఓట్లు సాధించగా, డీఎంకే 24.19 శాతం, అన్నాడీఎంకే 21.22 శాతం ఓట్లతో సరిపెట్టుకున్నాయి.
ఎన్నికల ఫలితాలపై స్టాలిన్ స్పందిస్తూ, ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఓటమిని అంగీకరిస్తూనే, గెలిచిన పార్టీతో తమ కూటమికి ఓట్ల శాతంలో తేడా చాలా స్వల్పమని పేర్కొన్నారు. "డీఎంకే నేతృత్వంలోని కూటమికి ఓటు వేసిన ప్రజలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మా కూటమికి 1.54 కోట్లకు పైగా ఓట్లు వచ్చాయి. గెలిచిన పార్టీతో ఓట్ల తేడా కేవలం 3.52 శాతం మాత్రమే. తమిళనాడు ప్రజలు మాపై ఉంచిన విశ్వాసాన్ని నేను బలం అని భావిస్తున్నాను" అని ఆయన తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.
కాగా, డీఎంకే మిత్రపక్షాల నేతలు బుధవారం స్టాలిన్‌తో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. మరోవైపు, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మిత్రపక్షాల కోసం టీవీకే ప్రయత్నాలు ప్రారంభించనుంది.