విజయ్‌కు అభినందనలు తెలిపిన మహేశ్ బాబు

Vijay Thalapathy Congratulated by Mahesh Babu on Election Win
  • అద్భుత విజయం సాధించారన్న మహేశ్ బాబు
  • తమిళనాడు అభివృద్ధికి ఈ విజయం అర్థవంతమైన బాటలు వేస్తుందని వ్యాఖ్య
  • దళపతి విజయ్ ఎన్నో అడ్డంకులు దాటుకుని చారిత్రక విజయం సాధించారన్న నిర్మాత
తమిళనాడులో సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ పెను సంచలనం సృష్టించింది. దీంతో విజయ్‌కు రాజకీయ, సినీ ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సాయంత్రం ఆరు గంటల సమయానికి టీవీకే పార్టీ 108 స్థానాల్లో, డీఎంకే 76 స్థానాల్లో, అన్నాడీఎంకే 49 స్థానాల్లో ముందంజలో (లేదా గెలుపు) ఉన్నాయి. తెలుగు సినిమా నటుడు మహేశ్ బాబు విజయ్ పార్టీ గెలుపుపై 'ఎక్స్' వేదికగా స్పందించారు.

సరికొత్త రికార్డులతో, అద్భుత విజయం సాధించారంటూ విజయ్‌ని అభినందించారు. ఈరోజు ప్రజలు మీపై ఉంచిన అపార నమ్మకానికి ఈ విజయం నిదర్శనమని పేర్కొన్నారు. తమిళనాడు అభివృద్ధికి ఈ విజయం అర్థవంతమైన బాటలు వేస్తుందని విశ్వసిస్తున్నానని మహేశ్ బాబు తెలిపారు.

మొదటి ఎన్నికలోనే విజయ్ అద్భుత విజయం సాధించారని నటుడు విశాల్ అన్నారు. యావత్ తమిళనాడులో ఎంజీఆర్ కాలం పునరావృతమైందని అభిప్రాయపడ్డారు. ప్రజలు మార్పు కోరుకుంటే ఎవరూ ఆపలేరని పేర్కొన్నారు. ఇందుకు నేటి రాజకీయ పరిస్థితులు నిదర్శనమని అన్నారు. విజయ్ రాష్ట్రాభివృద్ధితో పాటు చిత్రపరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తారని ఆశిస్తున్నానని పేర్కొన్నారు.

శుభాకాంక్షలు తెలిపిన జననాయగన్ చిత్ర నిర్మాత

తమిళనాడు ఎన్నికల్లో అద్భుత విజయం సాధించారని 'జననాయగన్' చిత్ర నిర్మాత కె. నారాయణ అన్నారు. విజయ్‌కి అభినందనలు తెలియజేశారు. దళపతి విజయ్ అన్ని అడ్డంకులు దాటుకుని చారిత్రక విజయం సాధించారని పేర్కొన్నారు. ఇదొక సరికొత్త విప్లవమని, రాబోయే తరాల వరకూ ఇది ప్రతిధ్వనిస్తూనే ఉంటుందని అన్నారు.
Go Back to Shorts
Vijay Thalapathy
Tamil Nadu Elections
TVK Party
Mahesh Babu
K Narayana
Jananayagan
Actor Vishal

More Telugu News