అమెరికా, ఇజ్రాయెల్ మరోసారి దాడులకు దిగే అవకాశం ఉంది: ఇరాన్ సైనికాధికారి సంచలన ఆరోపణ
Add ap7am to your home Screen

అమెరికా, ఇజ్రాయెల్ మరోసారి దాడులకు దిగే అవకాశం ఉంది: ఇరాన్ సైనికాధికారి సంచలన ఆరోపణ

Mohammad Jafar Asadi Claims US Israel May Attack Iran Again
  • అమెరికాతో మళ్లీ యుద్ధం జరిగే అవకాశం ఉందని వ్యాఖ్య
  • అమెరికా ఏ ఒప్పందాలకు, వాగ్దానాలకు కట్టుబడి ఉండటం లేదని విమర్శ
  • శత్రుదేశాలు చేసే ఎలాంటి దాడినైనా ఎదుర్కొంటామన్న ఇరాన్ సైనికాధికారి
అమెరికా, ఇజ్రాయెల్ తమ దేశంపై మరోసారి దాడులకు దిగే అవకాశం ఉందని ఇరాన్ సైనిక ప్రధాన కార్యాలయ డిప్యూటీ అధికారి మహమ్మద్ జాఫర్ అసదీ ఆరోపించారు. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ఏమాత్రం తగ్గడం లేదు. శాంతి ఒప్పందం కోసం ఇరాన్ తాజాగా పంపిన ప్రతిపాదనపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అసదీ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాతో మళ్లీ యుద్ధం జరిగే అవకాశం ఉందని అన్నారు.

అమెరికా మాట మీద నిలబడటం లేదని విమర్శించారు. ఏ ఒప్పందాలకు, వాగ్దానాలకు కట్టుబడి ఉండటం లేదని అన్నారు. చమురు ధరలు తగ్గించడం, తాము సృష్టించుకున్న గందరగోళం నుంచి బయటపడేలా అమెరికా అధికారుల ప్రకటనలు ఉన్నాయని విమర్శించారు. ఈ క్రమంలో తమ దేశంపై మరోసారి దాడులకు దిగే అవకాశం ఉందని ఆయన ఆరోపించారు. శత్రుదేశాలు చేసే ఎలాంటి దాడినైనా తాము ఎదుర్కొంటామని స్పష్టం చేశారు.

షిప్పింగ్ సంస్థలకు అమెరికా హెచ్చరిక

హర్మూజ్ జలసంధి వద్ద ఇరాన్ టోల్ ఫీజు వసూలు చేస్తున్నట్లు వార్తలు రావడంతో అమెరికా స్పందించింది. ఇరాన్ విధించే టోల్ చెల్లిస్తే ఆయా షిప్పింగ్ సంస్థలు తమ ఆంక్షలను ఎదుర్కోవాల్సి వస్తుందని యూఎస్ ట్రెజరీ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. టోల్ చెల్లింపులతో సహా ఇరాన్ సైన్యానికి మద్దతిచ్చే వారిపై కూడా తాము చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోమని అన్నారు.
Advertisement
Mohammad Jafar Asadi
Iran
America
Israel
US Iran tensions
Iran military
Hormuz Strait
shipping companies

More Telugu News