కవిత స్థాపించిన 'టీఆర్ఎస్'పై స్పందించిన కేటీఆర్
- చాలా పార్టీలు వస్తుంటాయి, పోతుంటాయన్న కేటీఆర్
- దేశంలో పాతికేళ్లు పూర్తి చేసుకున్న పార్టీలు తక్కువగా ఉన్నాయని వ్యాఖ్య
- తేజస్వీ సూర్య మాట్లాడితే మొదట ఖండించింది తామేనన్న కేటీఆర్
తేజస్వీ సూర్య మాట్లాడితే మొదట ఖండించింది మేమే
బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య పార్లమెంటులో తెలంగాణ విభజన గురించి తప్పుగా మాట్లాడితే ముందుగా ఖండించింది తమ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, దామోదర్ రావులేనని కేటీఆర్ గుర్తు చేశారు. తేజస్వీ సూర్య తనకు కూడా ఫోన్ చేసి, తాను మాట్లాడిన దానిని మీ (బీఆర్ఎస్) వాళ్లు తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పారని, కానీ మీరు మాట్లాడింది తప్పని ఆయనకు చెప్పేశానని కేటీఆర్ తెలిపారు. మేం ఖండించిన తర్వాతనే ఆయన సభలో వివరణ ఇచ్చారని చెప్పారు. బీఆర్ఎస్ సభ్యులు లోక్ సభలో ఉండి ఉంటే మా వాళ్లు అప్పుడే ఖండించేవారని చెప్పారు.