కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులకు హైకోర్టులో భారీ ఊరట
- 2011 మిలియన్ మార్చ్ కేసులను కొట్టివేసిన హైకోర్టు
- ట్యాంక్‌బండ్‌పై నాడు నిర్వహించిన మిలియన్ మార్చ్‌లో ఉద్రిక్తత
- కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై కేసు నమోదు
నాడు ట్యాంక్‌బండ్‌పై నిర్వహించిన మిలియన్ మార్చ్‌లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులను నిందితులుగా చేర్చారు. ఈ కేసులో వీరికి ఎలాంటి సంబంధం లేదని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయస్థానం వారిపై నమోదైన కేసులను కొట్టివేసింది.