పహల్గామ్ ఉగ్రదాడి దేశం మొత్తాన్ని కలిచివేసింది: ప్రధాని నరేంద్రమోదీ
- పహల్గామ్ ఉగ్రదాడికి ఏడాది
- ఎక్స్ వేదికగా నివాళులర్పించిన ప్రధాని మోదీ
- ప్రాణాలు కోల్పోయిన అమాయకులను ఎప్పటికీ మరిచిపోలేమన్న మోదీ
గత సంవత్సరం ఇదే రోజున పహల్గామ్‌లో దారుణమైన ఉగ్రదాడి జరిగిందని, అమాయకులు ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు. వారిని స్మరించుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ దాడిలో తమ వారిని కోల్పోయిన కుటుంబాలకు, బంధువులకు ప్రధాని సానుభూతి వ్యక్తం చేశారు. దుఃఖంలో, సంకల్పంలో దేశం మొత్తం ఐక్యంగా నిలబడాలని పిలుపునిచ్చారు.
భారత్ ఉగ్రవాదానికి ఎప్పటికీ తలవంచదని స్పష్టం చేశారు. ఉగ్రవాదుల కుట్రలు ఎన్నటికీ సఫలం కావని పేర్కొన్నారు. కాగా, గత సంవత్సరం ఏప్రిల్ 22న పహల్గామ్‌లో పర్యాటకులపై ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. హిందువులను లక్ష్యంగా చేసుకుని జరిగిన దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు.