కోర్టు దిక్కరణ కేసులో ఆర్డీవోకు జైలు శిక్ష
- రాజేంద్రనగర్ ఆర్డీవో కొప్పుల వెంకటరెడ్డికి నెల రోజుల జైలు శిక్ష, 2వేల జరిమానా విధించిన న్యాయస్థానం
- భూవివాదంలో కోర్టు ఉత్తర్వులు పాటించకపోవడమే కారణం
- అప్పీలు కోసం తీర్పు అమలును రెండు వారాలు నిలిపివేత
కోర్టు ధిక్కరణ కేసులో రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఆర్డీవో కొప్పుల వెంకట్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టు నెల రోజుల జైలుశిక్ష, రూ.2వేల జరిమానా విధించింది. అప్పీలు చేసుకునేందుకు వీలుగా తీర్పు అమలును రెండు వారాల పాటు నిలిపివేస్తున్నట్లు న్యాయస్థానం స్పష్టం చేసింది. జరిమానా చెల్లించని పక్షంలో మరో రెండు వారాలు అదనంగా జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్ద షాపూర్‌లోని 74.97 ఎకరాల భూమిపై వివాదం నడుస్తోంది. ఈ భూమికి సంబంధించి గతంలో ఇచ్చిన ఆదేశాలను ఆర్డీవో వెంకట్‌రెడ్డి నిర్దిష్ట గడువులోగా అమలు చేయలేదు. దీనిపై భూమి యజమాని నవాబ్ మహ్మద్ యూసుఫుద్దీన్ ఖాన్ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్ సీవీ భాస్కర్ రెడ్డి, కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగానే ధిక్కరించారని నిర్ధారించారు. ఈ నేపథ్యంలో ఆర్డీవో వెంకట్‌రెడ్డికి శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు.