మంత్రి నారా లోకేశ్ రెండు రోజుల తిరుపతి పర్యటన

Nara Lokesh Two Day Tirupati Tour
  • ఎన్టీఆర్, నారా రామ్మూర్తి నాయుడు క్రీడా ప్రాంగణాల ప్రారంభోత్సవం చేయనున్న మంత్రి లోకేశ్
  •  చంద్రగిరిలో ఇండోర్ స్టేడియంను కూడా ప్రారంభించనున్న లోకేశ్
  •  తిరుపతిలో పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొననున్న మంత్రి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ రెండు రోజుల పర్యటన నిమిత్తం తిరుపతికి వెళుతున్నారు. ఈరోజు రాత్రి ఆయన రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ నుంచి రోడ్డు మార్గంలో తిరుపతిలోని ఎస్.వి. ఆటోనగర్ సమీపంలో ఉన్న ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌కు చేరుకుని అక్కడే బస చేస్తారు.

తన పర్యటనలో భాగంగా రేపు ఉదయం మొదటగా సుమారు రూ.10.20 కోట్ల వ్యయంతో నిర్మించిన ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను ప్రారంభిస్తారు. ఆ తర్వాత చంద్రగిరి నియోజకవర్గానికి బయలుదేరి వెళ్తారు. అక్కడ స్థానిక బాలుర కళాశాల ప్రాంగణంలో రూ.3.20 కోట్లతో నూతనంగా నిర్మించిన నారా రామ్మూర్తి నాయుడు క్రీడా ప్రాంగణాన్ని, ఇండోర్ స్టేడియంను ప్రారంభిస్తారు.

ఈ కార్యక్రమాల అనంతరం తిరిగి తిరుపతికి చేరుకుంటారు. తిరుపతి గ్రామీణ మండలం తనపల్లి కూడలి వద్ద ఉన్న రామానాయుడు గార్డెన్స్‌లో నిర్వహించే పార్టీ కార్యకర్తల సమావేశంలో లోకేశ్ పాల్గొని ప్రసంగిస్తారు.
Go Back to Shorts
Nara Lokesh
Andhra Pradesh
Tirupati
NTR Sports Complex
Nara Ramamurthy Naidu
Chandragiri
AP IT Minister
Sports Complex Inauguration
Party Meeting

More Telugu News