ఎన్నికల సంఘం అధికారులు సమావేశం నుంచి వెళ్లిపొమ్మని చెప్పారు: తృణమూల్ ఎంపీ

Derek OBrien Claims Election Official Asked TMC MP to Leave Meeting
  • టీఎంసీ, ఎన్నికల సంఘం అధికారులు సమావేశం
  • ఏడు నిమిషాల పాటు జరిగిన సమావేశం... ఆపై రసాభాస
  • సీఈసీ మాట్లాడకుండా తృణమూల్ ఎంపీ అడ్డుకున్నారన్న ఈసీ అధికారులు
ఎన్నికల సంఘం అధికారి తమను సమావేశం నుంచి బయటకు వెళ్లిపొమ్మని చెప్పారని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రియన్ ఆరోపించారు. బెంగాల్‌లో ఈరోజు టీఎంసీ, ఎన్నికల సంఘం అధికారులు సమావేశమయ్యారు. ఏడు నిమిషాల పాటు జరిగిన సమావేశం రసాభాసగా మారింది. అనంతరం డెరెక్ ఓబ్రియన్ మీడియాతో మాట్లాడారు.

తమ పార్టీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాసిన లేఖను తాము ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు అందజేశామని తెలిపారు. ఎన్నికల అధికారులకు బీజేపీతో సంబంధాలు ఉన్న ఉదంతాలను  ఆయన దృష్టికి తీసుకువెళ్లామని అన్నారు. అయితే ఎన్నికల సంఘం అధిపతి ఆగ్రహంతో తమను సమావేశం నుంచి బయటకు వెళ్లిపొమ్మని చెప్పారని ఆరోపించారు.

ఈ సమావేశంపై ఎన్నికల సంఘం అధికారులు కూడా స్పందించారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ మాట్లాడుతున్న సమయంలో టీఎంసీ ఎంపీ ఇతర ఎన్నికల కమిషనర్లపై గట్టిగా మాట్లాడారని, సీఈసీ మాట్లాడకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. బెంగాల్‌లో ఎలాంటి హింసాత్మక ఘటనలు, బెదిరింపులు, ప్రలోభాలు లేకుండా శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించడానికి చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.
Advertisement
Derek O'Brien
Trinamool Congress
Election Commission of India
Mamata Banerjee
West Bengal Elections

More Telugu News