ఇరాన్‌పై సైనిక చర్యను రెండు వారాల పాటు నిలిపివేసిన ట్రంప్
- పాకిస్థాన్ ప్రధాని అభ్యర్థన మేరకు ఈ నిర్ణయమన్న ట్రంప్
- హార్ముజ్ జలసంధిని తెరవాలనే షరతు విధించిన అమెరికా
- తన 'ట్రూత్ సోషల్' మీడియా వేదిక ద్వారా ఈ ప్రకటన చేసిన ట్రంప్
పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ చేసిన అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' మీడియా ఖాతాలో వెల్లడించారు. అయితే, ఇరాన్ తక్షణమే హార్ముజ్ జలసంధిని రెండు వారాల పాటు సురక్షితంగా తెరవాలనే షరతుకు కట్టుబడి ఉండాలని ఆయన స్పష్టం చేశారు. దీనిని ఇరుపక్షాల కాల్పుల విరమణగా ఆయన అభివర్ణించారు.
ఈ ప్రకటనకు కొద్ది గంటల ముందు, 'ఈ రాత్రికి ఒక నాగరికత అంతరించిపోతుంది' అంటూ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు చేయడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అయితే, ఇరాన్ నుంచి వచ్చిన 10 సూత్రాల ప్రతిపాదన చర్చలకు ఆమోదయోగ్యంగా ఉందని ట్రంప్ పేర్కొనడంతో వాతావరణం మారింది.