పవన్ కల్యాణ్‌తో వంగవీటి రాధాకృష్ణ ఆత్మీయ భేటీ
- డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కలిసిన వంగవీటి రాధా
- మంగళగిరి క్యాంపు కార్యాలయంలో సమావేశం
- త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై సుదీర్ఘ చర్చ
- పవన్ చేపడుతున్న సంస్కరణలను అభినందించిన రాధా
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ భేటీ అయ్యారు. మంగళగిరిలోని క్యాంప్ కార్యాలయంలో గురువారం సాయంత్రం ఈ సమావేశం జరిగింది. ఇది మర్యాదపూర్వక భేటీ అని, ఇరువురి మధ్య ఆత్మీయ వాతావరణంలో చర్చలు జరిగాయని తెలిసింది.
సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న స్నేహబంధం నేపథ్యంలో ఈ భేటీ జరిగినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా గతంలో ప్రజారాజ్యం పార్టీలో కలిసి పనిచేసిన రోజులను, అలాగే 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కలిసి ప్రచారం నిర్వహించిన క్షణాలను ఇరువురూ గుర్తుచేసుకున్నారు.
ఈ సమావేశంలో సమకాలీన రాజకీయ పరిస్థితులు, త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై ఇరువురు నేతలు సుదీర్ఘంగా చర్చించుకున్నట్లు సమాచారం. ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పవన్ కల్యాణ్ తన శాఖల్లో చేపడుతున్న సంస్కరణలు, తీసుకొస్తున్న మార్పులను వంగవీటి రాధా ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్ర రాజకీయాల్లో ఈ భేటీ ఆసక్తిని రేకెత్తిస్తోంది.