మచిలీపట్నంలో మరగుజ్జు యువకుడ్ని ప్రేమించి పెళ్లాడిన యువతి

Gowsiya Marries Dwarf Lover in Machilipatnam Against Family Wishes
షార్ట్స్‌లో చూడండి
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ప్రేమకు రూపురేఖలు అడ్డుకావని నిరూపిస్తూ ఓ వినూత్న వివాహం జరిగింది. తాను చిన్నప్పటి నుంచి ప్రేమించిన మరుగుజ్జు యువకుడిని, కుటుంబ సభ్యులను ఎదిరించి మరీ ఓ యువతి పెళ్లి చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా ఆసక్తిని రేకెత్తించింది.

వివరాల్లోకి వెళితే... మచిలీపట్నానికి చెందిన వేముల శశి, గౌసియా 9వ తరగతి నుంచే ప్రేమించుకుంటున్నారు. శశి జిల్లా కోర్టులో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తుండగా, గౌసియా ఫార్మసిస్ట్‌గా స్థిరపడింది. వీరి స్నేహం కొన్నేళ్ల క్రితం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకొని జీవితాంతం కలిసి ఉండాలని నిర్ణయించుకున్నారు. అయితే, వీరి వివాహానికి గౌసియా కుటుంబ సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. శశి మరుగుజ్జు కావడంతో ఈ పెళ్లికి అంగీకరించేది లేదని కరాఖండిగా చెప్పారు.

అయినప్పటికీ, గౌసియా తన ప్రేమను వదులుకోలేదు. కుటుంబ సభ్యుల ఇష్టానికి వ్యతిరేకంగా వెళ్లి శశిని వివాహం చేసుకుంది. అనంతరం తమకు కుటుంబ సభ్యుల నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ ఈ నవ దంపతులు ఇరుకుదురుపేట పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు ఇరు కుటుంబాల వారిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. తమ ప్రేమను నిలబెట్టుకోవాలనే పట్టుదలతో ఉన్న ఈ జంటకు పలువురు మద్దతు తెలుపుతున్నారు.
Go Back to Shorts
Gowsiya
Machilipatnam love marriage
dwarf man marriage
Krishna district
interfaith marriage
love story
family opposition
police counseling
Veemula Shashi

More Telugu News