యుద్ధం ఎఫెక్ట్.. ఆసియాలో ఖాళీగా నిలిచిపోయిన 50 గ్యాస్ ట్యాంకర్లు

Hormuz Strait Conflict 50 LNG Tankers Stranded in Asia
  • హర్మూజ్ జలసంధి మూసివేయడంతో నిలిచిపోయిన రవాణా
  • కీలకమైన రస్ లఫాన్ గ్యాస్ క్షేత్రంపై గత నెలలో ఇరాన్ దాడి
  • ఎల్ఎన్జీ గ్యాస్ సరఫరాకు అంతరాయం
  • హర్మూజ్ సహా వివిధ ప్రాంతాల్లో ఖాళీగా ట్యాంకర్లు
ఇరాన్, అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం నేపథ్యంలో చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధి మీదుగా రవాణా దాదాపు ఆగిపోయిన విషయం తెలిసిందే. ఈ కారణంగా ఆసియా ప్రాంతంలో సుమారు 50 ఎల్ఎన్జీ ట్యాంకర్లు ఖాళీగా నిలిచిపోయినట్లు తెలుస్తోంది. హర్మూజ్ జలసంధిని మూసివేయడంతో పాటు ఖతార్‌లో ఎగుమతులు నిలిచిపోవడంతో ట్యాంకర్లు ఖాళీగా నిలిచిపోయాయి.

గడిచిన రెండు దశాబ్దాలుగా ఖతార్‌లోని రస్ లఫాన్ గ్యాస్ వాణిజ్యానికి కీలక కేంద్రంగా ఉంటోంది. పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లోని అమెరికా మౌలిక సదుపాయాలపై ఇరాన్ దాడి చేస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇక్కడి గ్యాస్ పరిశ్రమపై ఇరాన్ క్షిపణి దాడులు నిర్వహించడంతో గ్యాస్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దీంతో ఎల్ఎన్జీ గ్యాస్ కోసం రస్ లఫాన్ వెళ్లిన నౌకలు హర్మూజ్ జలసంధి వద్ద పదుల సంఖ్యలో నిలిచిపోయాయి.

ఇదిలా ఉండగా, భారత్, శ్రీలంక తీరంలో, మలక్కా జలసంధికి ఉత్తర ప్రవేశ ద్వారంలో, సింగపూర్‌కు తూర్పున ఉన్న జలాల్లోనూ ఈ ట్యాంకర్లు ఖాళీగా ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఏ ఒక్క ట్యాంకర్‌లోనూ ఎల్ఎన్జీ లేదని తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 800 ఎల్ఎన్జీ ట్యాంకర్లు నిర్వహణలో ఉన్నట్లు తెలుస్తోంది.
Go Back to Shorts
Hormuz Strait
Iran
Israel
LNG Tankers
Gas Supply
Qatar
Ras Laffan
Asia
Energy Crisis

More Telugu News