F-35 Fighter Jet: అమెరికా F-35 జెట్‌ మరో దానిని కూల్చేశాం.. ఇరాన్ ప్రకటన

F 35 Fighter Jet Iran Claims Downing Second US Aircraft
షార్ట్స్‌లో చూడండి
పశ్చిమాసియాలో ఇప్పటికే యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. అమెరికాకు చెందిన రెండో F-35 ఫైటర్ జెట్‌ను తమ సైనిక దళాలు కూల్చివేసినట్లు శుక్రవారం ప్రకటించింది. ఇరాన్ ప్రభుత్వ నియంత్రణలోని మీడియా ఈ వార్తను ప్రసారం చేసింది. అయితే, ఈ క్లెయిమ్‌ను అమెరికా రక్షణ శాఖ (పెంటగాన్) ఇంతవరకు ధ్రువీకరించలేదు.

ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) కథనం ప్రకారం.. సెంట్రల్ ఇరాన్ గగనతలంలోకి ప్రవేశించిన అమెరికా F-35 యుద్ధ విమానాన్ని తమ సరికొత్త ఎయిర్-డిఫెన్స్ వ్యవస్థ ద్వారా కూల్చివేసినట్లు తెలిపింది. కేవలం కొన్ని రోజుల వ్యవధిలోనే ఇది రెండో అమెరికా ఫైటర్ జెట్‌ను కూల్చివేయడం అని ఇరాన్ పేర్కొంది. ఈ ప్రకటనతో అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేగింది.

కాగా, ఇరాన్ చేస్తున్న ఆరోపణలపై అమెరికా ఇంతవరకు అధికారికంగా స్పందించలేదు. గతంలో మార్చి 19న కూడా ఇరాన్ ఇలాంటి ప్రకటనే చేసింది. ఆ సమయంలో తమ F-35 విమానం దెబ్బతిని అత్యవసరంగా ల్యాండ్ అయిందని అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) అంగీకరించింది కానీ, ఇరాన్ దాడిలో కూలిపోయిందన్న వార్తలను ఖండించింది. మార్చి 22న తమ యుద్ధ విమానాలు ఏవీ ఇరాన్ చేతిలో కూలిపోలేదని స్పష్టం చేసింది. తాజాగా ఇరాన్ చేసిన ఈ రెండో క్లెయిమ్‌పై అమెరికా స్పందన కోసం ప్రపంచ దేశాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. స్వతంత్ర వర్గాలు ఈ ఘటనను ధ్రువీకరించాల్సి ఉంది.
Go Back to Shorts
F-35 Fighter Jet
Iran
America
US Military
IRGC
Pentagon
Middle East Conflict
Air Defense System
CENTCOM

More Telugu News