Gaurav: ఆగ్రా జంట హత్యల కేసులో సంచలన తీర్పు.. భర్త సహా ముగ్గురికి మరణశిక్ష

Agra double murder Husband gets death penalty for wifes murder
షార్ట్స్‌లో చూడండి
ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో నాలుగేళ్ల క్రితం జరిగిన జంట హత్యల కేసులో స్థానిక కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కట్టుకున్న భార్యను, ఆమె బంధువును అత్యంత కిరాతకంగా హత్య చేసిన కేసులో భర్త, అతడి తండ్రి, సోదరుడికి మరణశిక్ష విధించింది. దోషులు ముగ్గురికీ తలో లక్ష రూపాయల చొప్పున జరిమానా కూడా విధించింది.

2022లో ఏత్మాద్‌పూర్ ప్రాంతంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. గౌరవ్ అనే వ్యక్తి తన భార్య పూజకు, ఆమె బంధువైన శివం సిసోడియాకు వివాహేతర సంబంధం ఉందనే అనుమానం పెంచుకున్నాడు. మే 27, 2022న శివం.. పూజను కలిసేందుకు వారి ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో వారిద్దరినీ చూసిన గౌరవ్ కుటుంబ సభ్యులు, వారిని పట్టుకుని వీధిలోకి లాక్కొచ్చారు.

అనంతరం గౌరవ్, అతడి తండ్రి మదన్, సోదరుడు అభిషేక్ కలిసి కర్రలతో దాడి చేసి, కిందపడిన తర్వాత గొడ్డలి వంటి పదునైన ఆయుధంతో ఇద్దరి గొంతులు కోసి హత్య చేశారు. ఈ ఘటన తర్వాత గౌరవ్ తండ్రి, సోదరుడు పోలీసులకు లొంగిపోగా, పోలీసులు హత్యకు ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

ఈ కేసు విచారణలో భాగంగా కోర్టు 14 మంది సాక్షులను విచారించింది. సీసీటీవీ ఫుటేజీ, మృతుడు శివం సోదరుడి సాక్ష్యం ఈ కేసులో కీలకంగా మారాయి. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం, ముగ్గురినీ దోషులుగా నిర్ధారించి మరణశిక్ష విధించింది. సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో గౌరవ్ తల్లిని నిర్దోషిగా విడుదల చేసింది. తీర్పు వెలువడిన తర్వాత దోషులు ఎలాంటి భావోద్వేగం ప్రదర్శించలేదు. ఈ తీర్పును హైకోర్టులో సవాలు చేస్తామని తెలిపారు.
Go Back to Shorts
Gaurav
Agra double murder case
Uttar Pradesh crime
Shivam Sisodia
honor killing
death penalty
court verdict
Etmadpur murder
CCTV footage
murder weapon

More Telugu News