Iran: అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్‌లో 1,900 మంది మృతి

1900 Killed in Iran in US Israel Attacks
షార్ట్స్‌లో చూడండి
అమెరికా-ఇజ్రాయెల్ దాడులు ప్రారంభమైనప్పటి నుంచి ఇరాన్‌లో 1,900 మందికి పైగా మరణించారని ఇరాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. గత నెల ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇప్పటివరకు అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో సుమారు 20,000 మంది గాయపడ్డారని తెలుస్తోంది.

ఇరాన్ చేసిన ప్రతీకార దాడుల్లో ఇజ్రాయెల్‌లో 18 మంది, గల్ఫ్‌లో 20 మంది మృతి చెందారు. 13 మంది అమెరికన్ సైనికులు కూడా మృతి చెందారు. లెబనాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 1,100 మందికి పైగా మరణించారని అక్కడి అధికారులు తెలిపారు. ఇరాక్‌లో మరో 80 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇదిలా ఉండగా, ఇజ్రాయెల్ సహా గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దీర్ఘ, మధ్యశ్రేణి క్షిపణులను ప్రయోగించినట్లు ఐఆర్జీసీ తెలిపింది. ఈ దాడుల్లో బహ్రెయిన్‌లోని అమెరికా పేట్రియాట్ వైమానిక రక్షణ వ్యవస్థ నిర్వహణ కేంద్రం ధ్వంసమైనట్లు తెలిపింది.
Go Back to Shorts
Iran
Iran Israel conflict
Israel attacks
US attacks
Red Crescent
Middle East conflict
IRGC
American bases
Lebanon
Bahrain

More Telugu News