Sri Rama Navami: భాగ్యనగరంలో రేపు శ్రీరామనవమి శోభాయాత్ర... ట్రాఫిక్ ఆంక్షలు

Sri Rama Navami Shobha Yatra in Hyderabad Traffic Restrictions Imposed
షార్ట్స్‌లో చూడండి
శ్రీరామనవమి సందర్భంగా రేపు హైదరాబాద్ నగరంలో శోభాయాత్ర నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో నగరంలోని పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. సీతారాంబాగ్ దేవాలయం నుంచి కోఠిలోని హనుమాన్ వ్యాయామశాల వరకు రేపు శోభాయాత్ర నిర్వహించనున్నారు.

ఈ నేపథ్యంలో రేపు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్న మార్గాల్లో వాహనాలకు అనుమతి ఉండదు. ట్రాఫిక్‌ను ఇతర మార్గాలకు మళ్లిస్తారు.

ట్రాఫిక్ మళ్లింపు ఇలా...

సీతారాంబాగ్, బోయిగూడ కమాన్ నుంచి మల్లేపల్లి క్రాస్ రోడ్స్ వైపు మళ్లించనున్నారు.
మంగళ్‌హాట్, గాంధీ విగ్రహం, పురానాపూల్, జుమేరాత్ బజార్ నుంచి వచ్చే వాహనాలను టక్కర్‌వాడి జంక్షన్ వైపు మళ్లిస్తారు.
ఎంజే బ్రిడ్జి, బేగంబజార్, అఫ్జల్‌గంజ్, సిటీ కాలేజీ వైపు వెళ్లే వాహనాలను జుమేరాత్ బజార్ మీదుగా మళ్లిస్తారు.
అబిడ్స్ జీపీవో, సుల్తాన్‌బజార్, కోఠి, అబిడ్స్ ప్రధాన రోడ్ల వద్ద ట్రాఫిక్‌ను నిలిపివేయనున్నారు.
Go Back to Shorts
Sri Rama Navami
Hyderabad
Shobha Yatra
Traffic restrictions
Seetharambagh Temple
Koti Hanuman Vyayamshala

More Telugu News