Israel Katz: ఇరాన్‌పై 15,000 బాంబులు వేశాం... 3 వేల లక్ష్యాలపై దాడులు: ఇజ్రాయెల్

Israel Claims to Have Bombed Iran with 15000 Bombs
షార్ట్స్‌లో చూడండి
యుద్ధం ప్రారంభమైన పిబ్రవరి 28వ తేదీ నుంచి ఇరాన్‌పై 15,000 బాంబులు వేశామని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఈ మేరకు మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ మాట్లాడుతూ, గత ఏడాది జూన్ నెలతో పోలిస్తే నాలుగు రెట్లు ఎక్కువ బాంబులు వేశామని తెలిపారు. ఫిబ్రవరి 28వ తేదీన ఇరాన్‌పై అమెరికాతో కలిసి ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించిన విషయం తెలిసిందే.

యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి తమ సైన్యం 15 వేల బాంబులను ఇరాన్‌పై ప్రయోగించిందని కాట్జ్ వెల్లడించారు. గత ఏడాది జూన్‌లో 12 రోజుల పాటు జరిగిన సంఘర్షణ సమయంలో కంటే నాలుగురెట్లు బాంబులు ఉపయోగించినట్లు తెలిపారు. ఇరాన్‌లోని 3,000 లక్ష్యాలపై దాడులు చేసినట్లు తెలిపారు.

అయితే ఇరాన్‌పై దాడిని ఐదు రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు రోజుల క్రితం సంచలన ప్రకటన చేశారు. ఈ ప్రకటనతో తమకు సంబంధం లేదని ఇజ్రాయెల్ చెబుతోంది.
Go Back to Shorts
Israel Katz
Iran
Israel
Donald Trump
Bombing Iran
US Israel relations
Middle East conflict
Iran war

More Telugu News