Iran: మీ ఓటమిని దౌత్య విజయంగా చూపొద్దు.. అమెరికాకు ఇరాన్ హెచ్చరిక
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నడుమ ఇరాన్, అమెరికాకు తీవ్రస్థాయిలో హెచ్చరికలు జారీ చేసింది. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణలో తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు అమెరికా ప్రయత్నిస్తోందని ఇరాన్ సైనిక దళాల ముఖ్య ప్రతినిధి ఆరోపించారు. ఓటమిని ఒక ‘దౌత్యపరమైన ముందడుగు’గా చిత్రీకరించే ప్రయత్నాలను మానుకోవాలని ట్రంప్ కు హితవు పలికారు.
ఇరాన్ ప్రయోగించిన క్షిపణులను నిలువరించడంలో అమెరికా విఫలమైందని, ఆ నిస్సహాయతను ఇప్పుడు ప్రపంచం ముందు ఒక విజయంగా ప్రచారం చేసుకోవాలని చూస్తోందని ఆయన విమర్శించారు. తమ దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి కఠిన చర్యలకైనా వెనుకాడబోమని, శత్రువుల ఎత్తుగడలను తిప్పికొట్టే పూర్తి సైనిక సామర్థ్యం తమకు ఉందని ఆయన స్పష్టం చేశారు.
ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరగడానికి అమెరికా జోక్యమే కారణమని ఇరాన్ ఆరోపించింది. ఇజ్రాయెల్‌కు అందిస్తున్న సైనిక సహకారాన్ని తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేసింది. ఒకవైపు శాంతి చర్చల గురించి మాట్లాడుతూ, మరోవైపు క్షేత్రస్థాయిలో ఇజ్రాయెల్‌ను ప్రోత్సహించే ద్వంద్వ వైఖరిని అమెరికా వీడాలని సూచించింది. ఈ అబద్ధపు ప్రచారాలు ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇరాన్ సైనిక ప్రతినిధి హెచ్చరించారు.