Donald Trump: నువ్వే కదా యుద్ధం చేద్దాం అన్నావు.. రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్‌పై ట్రంప్ నిందలు

Donald Trump Blames Pete Hegseth for Iran Conflict
షార్ట్స్‌లో చూడండి
పశ్చిమాసియాలో ఇరాన్‌తో యుద్ధ వాతావరణం ముదురుతున్న వేళ, అమెరికా ప్రభుత్వంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇరాన్‌పై సైనిక చర్యకు తన రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ ఇచ్చిన సలహాయే కారణమంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయనపై బహిరంగంగా నిందలు మోపారు. "నువ్వే కదా చేద్దాం అన్నావు? 'వాళ్లు అణ్వాయుధాలు కలిగివుండకూడదంటే యుద్ధం చేద్దాం' అన్నావు కదా?" అంటూ ట్రంప్ నేరుగా పక్కనే వున్న హెగ్సెత్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించడం వాషింగ్టన్ రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది.

ఇరాన్‌పై దూకుడుగా వ్యవహరించాలన్న హెగ్సెత్ సలహా వల్లే అమెరికా ఇప్పుడు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటోందని ట్రంప్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా పెరుగుతున్న ఒత్తిడి, ప్రతికూల పరిణామాలతో ఆయన తీవ్ర అసహనంతో ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన తన వైఫల్యాన్ని రక్షణ మంత్రిపైకి నెట్టే ప్రయత్నం చేస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు దాడులు కొనసాగించాలని ఒత్తిడి తెస్తుండటం గమనార్హం.

ట్రంప్ తాజా వ్యాఖ్యలతో అమెరికా తన యుద్ధ వ్యూహాన్ని మార్చుకునే అవకాశం కనిపిస్తోంది. యుద్ధాన్ని ముగించేందుకు లేదా తాత్కాలికంగా విరామం ఇచ్చేందుకు ట్రంప్ సిద్ధమవుతున్నారని, అందులో భాగంగానే ఈ వ్యాఖ్యలు చేశారని సమాచారం. అధ్యక్షుడికి, రక్షణ మంత్రికి మధ్య పెరిగిన ఈ దూరం ఇరాన్ విషయంలో అమెరికా తదుపరి అడుగుపై ఉత్కంఠను రేపుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో హెగ్సెత్ తన పదవికి రాజీనామా చేసే అవకాశాలున్నాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ట్రంప్ తన ఉన్నతస్థాయి భద్రతా సలహాదారులతో ప్రత్యేకంగా సమావేశమై పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు తెలుస్తోంది.
Go Back to Shorts
Donald Trump
Pete Hegseth
Iran
US military
Netanyahu
Middle East tensions
US foreign policy
War strategy
Washington politics
Israel

More Telugu News