LPG Cylinder: ఎల్పీజీ సిలిండర్ బరువు 14.2 నుంచి 10 కిలోలకు తగ్గనుందా?: కేంద్రం ఏం చెప్పిందంటే?

LPG Cylinder Weight Reduction False Says Central Government
షార్ట్స్‌లో చూడండి
ఎల్పీజీ సిలిండర్ బరువును 14.2 కిలోల నుంచి 10 కిలోలకు తగ్గించే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. అందులో ఎలాంటి వాస్తవంలేదని, అవన్నీ ఊహాగానాలేనని పెట్రోలియం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాతశర్మ స్పష్టం చేశారు.

పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో వంటగ్యాస్ కొరతను అధిగమించేందుకు చమురు సంస్థలు సిలిండర్ బరువును తగ్గించే యోచనలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. గృహ అవసరాల కోసం 10 కిలోల ఎల్పీజీ సిలిండర్లను పంపిణీ చేసేందుకు ప్రణాలికలు రూపొందినట్లు వార్తలు వచ్చాయి.

గృహ అవసరాల కోసం 14.2 కిలోల సిలిండర్ల స్థానంలో 10 కిలోల ఎల్పీజీని నింపి అందించే అవకాశాలను చమురు పరిశ్రమలు పరిశీలిస్తున్నట్లు ఆ కథనాలు పేర్కొన్నాయి. గృహ అవసరాలకు సిలిండర్ల కొరత లేకుండా చూసే ఉద్దేశంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను కేంద్రం కొట్టిపారేసింది.
Go Back to Shorts
LPG Cylinder
LPG
Cooking Gas
Cylinder Weight
Petroleum Ministry
Sujata Sharma
Gas Cylinder

More Telugu News