Iran: దాడులు నిలిపివేసి, హర్మూజ్ జలసంధిని తెరవండి: ఇరాన్‌కు 22 దేశాల విజ్ఞప్తి
అరబ్ దేశాలపై దాడులను నిలిపివేసి, హర్మూజ్ జలసంధిని తక్షణమే తెరవాలని యూకే, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, యూఏఈ, బహ్రెయిన్ సహా 22 దేశాలు ఇరాన్‌కు విజ్ఞప్తి చేశాయి. అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం 22వ రోజుకు చేరిన విషయం తెలిసిందే. దాడులు, ప్రతిదాడులు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. ఇరాన్ అరబ్ దేశాల్లోని అమెరికా సదుపాయాలపై వైమానిక, డ్రోన్ దాడులు చేస్తోంది.
ఈ క్రమంలో 22 దేశాలు కలిసి ఇరాన్‌కు విజ్ఞప్తి చేశాయి. మరోవైపు వాణిజ్య నౌకలు, ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులను ఈ దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఇరాన్ చర్యలు ప్రపంచవ్యాప్తంగా ప్రజలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయని ఈ దేశాలు సంయుక్త ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశాయి.
డిగో గార్సియాపై దాడి.. తీవ్రంగా స్పందించిన బ్రిటన్
హిందూ మహాసముద్రంలోని డిగో గార్సియా ద్వీపంలో ఉన్న యూఎస్-యూకే సైనిక స్థావరం లక్ష్యంగా ఇరాన్ క్షిపణి దాడులకు పాల్పడింది. ఈ దాడిని బ్రిటన్ తీవ్రంగా ఖండించింది. ఇరాన్ దాడులు దుస్సాహసంగా అభివర్ణించింది. పశ్చిమాసియా దేశాలపై ఇరాన్ దాడులు, హర్మూజ్ జలసంధి మూసివేత వంటివి తమ ప్రయోజనాలకు, తమ మిత్రదేశాలకు ముప్పుగా బ్రిటన్ రక్షణ శాఖ తెలిపింది.