జాగింగ్ చేస్తూ 'ధురంధర్' సినిమాపై ఇద్దరు దేశాధినేతల చర్చ.. వైరల్ వీడియో!

Alexander Stubb and Mark Carney Discuss Dhurandhar Movie While Jogging
  • లండన్‌లో జాగింగ్ చేస్తూ కనిపించిన ఫిన్‌లాండ్, కెనడా అధినేతలు
  • భారతీయ సినిమా 'ధురంధర్' గురించి వారి మధ్య ఆసక్తికర చర్చ
  • సినిమా చూశానని చెప్పాకే ఇండియాలో ఫాలోయింగ్ పెరిగిందన్న స్టబ్
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
ఫిన్‌లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్, కెనడా ప్రధాని మార్క్ కార్నీ కలిసి జాగింగ్ చేస్తున్న ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. లండన్‌లోని హైడ్ పార్క్‌లో తీసిన ఈ వీడియోలో వారిద్దరూ ఓ భారతీయ సినిమా గురించి మాట్లాడుకోవడం విశేషం.

కెనడా ప్రధాని మార్క్ కార్నీ అధికారిక పర్యటన నిమిత్తం యూకే వెళ్లినప్పుడు ఈ సంఘటన జరిగింది. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు తమ జీవిత భాగస్వాములతో కలిసి జాగింగ్‌కు వెళ్లారు. జాగింగ్ చేస్తున్న సమయంలో 'భారత్‌లో మీ ఇన్‌స్టాగ్రామ్ ఫాలోయింగ్ ఎలా ఉంది?' అని కెనడా ప్రధాని కార్నీ, ఫిన్‌లాండ్ అధ్యక్షుడు స్టబ్‌ను అడిగారు. దీనికి స్టబ్ బదులిస్తూ, 'నేను హిందీ సినిమా 'ధురంధర్' చూశానని చెప్పిన తర్వాత అది విపరీతంగా పెరిగింది' అని తెలిపారు.

ఈ వీడియోను స్వయంగా ఫిన్‌లాండ్ అధ్యక్షుడు స్టబ్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారు. ఇద్దరు ప్రపంచ నేతలు ఓ భారతీయ సినిమా గురించి ఇంత సహజంగా మాట్లాడుకోవడంతో ముఖ్యంగా భారతీయ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో ఆన్‌లైన్‌లో విస్తృతంగా షేర్ అవుతూ, వైర‌ల్‌గా మారింది.
Advertisement
Alexander Stubb
Finland President
Mark Carney
Canada Prime Minister
Dhuranadhar Movie
Indian Cinema
Viral Video
Hyde Park London
Instagram Followers

More Telugu News