Viral Video: వీడియో సరదా ప్రాణం తీసింది.. కెమెరా ముందు ఛాతిలో పిస్టల్ తో కాల్చుకున్న యువకుడు!

Delhi Youth Pawan Kills Self in Gun Stunt Video
షార్ట్స్‌లో చూడండి
సోషల్ మీడియా వీడియోల మోజులో పడి యువత ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. తాజాగా తూర్పు ఢిల్లీలో ఇలాంటి అత్యంత దారుణమైన ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. కేవలం సరదా కోసం, ఓ స్టంట్ వీడియో చిత్రీకరిస్తూ 28 ఏళ్ల యువకుడు తన ప్రాణాలను తానే తీసుకున్నాడు. సోదరుడు కెమెరాలో రికార్డ్ చేస్తుండగానే, తన ఛాతిపై తుపాకీ పెట్టుకుని ట్రిగ్గర్ నొక్కి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం న్యూ అశోక్ నగర్‌లోని దల్లుపురా గ్రామానికి చెందిన పవన్ (28) ఈ ఘటనలో మరణించాడు. తన కజిన్ అయిన హిమాన్షుకు చెందిన లైసెన్స్‌డ్ పిస్టల్‌ను పవన్ తన చేతిలోకి తీసుకుని ఎగాదిగా పరీక్షించాడు. ఈ క్రమంలో ఓ స్టంట్ వీడియో తీయాలని నిర్ణయించుకున్నాడు. హిమాన్షు ఈ ఘటనను తన మొబైల్‌లో చిత్రీకరిస్తుండగా, పవన్ తుపాకీలోకి మ్యాగజైన్ లోడ్ చేశాడు. "ఆ బటన్ నొక్కు, లోపలికి వెళ్తుంది" అని హిమాన్షు సూచించడం వీడియోలో వినిపించింది.

ఆ తర్వాత పవన్ తుపాకీని కాక్ చేయగా, హిమాన్షు "ఫైర్ చేయొద్దు" అని హెచ్చరించాడు. కానీ, ఆ మాటలను పవన్ ఏమాత్రం పట్టించుకోలేదు. క్షణాల వ్యవధిలోనే తుపాకీని తన ఛాతి ఎడమ వైపు పెట్టుకుని, కెమెరా వైపు చూసి చిన్నగా నవ్వాడు. మరుక్షణమే ట్రిగ్గర్ నొక్కడంతో తూటా దూసుకెళ్లింది. తీవ్ర రక్తస్రావంతో పవన్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఈ అనూహ్య పరిణామంతో షాక్‌కు గురైన హిమాన్షు.. "సోదరా, ఏం పని చేశావ్?" అని భయంతో అరవడం వీడియోలో రికార్డయింది.

వెంటనే పవన్‌ను వసుంధర ఎన్‌క్లేవ్‌లోని ధర్మశిల ఆసుపత్రికి తరలించగా, అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫోరెన్సిక్ బృందాలు ఘటనా స్థలాన్ని, ఆసుపత్రిని పరిశీలించాయి. హిమాన్షుకు చెందిన లైసెన్స్‌డ్ పిస్టల్‌తో పాటు 10 లైవ్ క్యాట్రిడ్జ్‌లను, ఘటనను రికార్డ్ చేసిన మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీడియో ఆధారాలు, ప్రాథమిక విచారణ ఆధారంగా న్యూ అశోక్ నగర్ పోలీస్ స్టేషన్‌లో బీఎన్ఎస్ సెక్షన్ 105, ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Go Back to Shorts
Viral Video
Pawan
Delhi crime
gun accident
social media stunt
shooting video
firearm death
New Ashok Nagar
youth tragedy
crime news India
accidental shooting

More Telugu News