Iran: ఇజ్రాయెల్‌పై ఇరాన్ ‘డ్యాన్సింగ్ మిస్సైల్’ ప్రయోగం
ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాల మధ్య జరుగుతున్న యుద్ధం 17వ రోజుకు చేరుకుంది. ఈ క్రమంలో ఇరాన్ తొలిసారిగా ‘డ్యాన్సింగ్ మిస్సైల్’ అని పిలిచే అత్యాధునిక క్షిపణిని ప్రయోగించి ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసింది. సాధారణ క్షిపణులు ఒకే మార్గంలో వెళ్తాయి, కానీ ఈ క్షిపణి గగనతలంలో దిశలను మారుస్తూ, వంకరటింకరగా ప్రయాణిస్తూ ఇజ్రాయెల్ రక్షణ కవచం ‘ఐరన్ డోమ్’ను ముప్పుతిప్పలు పెట్టింది. ఈ క్షిపణి ప్రయాణించే తీరును చూసి రక్షణ రంగ నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్స్ కోర్ (ఐఆర్ జీసీ) ఈ ప్రయోగాన్ని ధ్రువీకరించింది. ఈ క్షిపణులు రాడార్లకు దొరకకుండా, శత్రుదేశాల రక్షణ వ్యవస్థలను ఏమారుస్తూ లక్ష్యాన్ని చేరుకుంటాయని వెల్లడించింది. ఇజ్రాయెల్‌లోని వ్యూహాత్మక సైనిక స్థావరాలే లక్ష్యంగా వీటిని ప్రయోగించినట్లు తెలుస్తోంది. తమ అమ్ములపొదిలో ఉన్న అత్యంత రహస్య ఆయుధాల్లో ఇదొకటని, తాము ఇంకా తమ పూర్తి సామర్థ్యాన్ని ప్రదర్శించలేదని ఇరాన్ హెచ్చరించింది.
మరోవైపు, ఇజ్రాయెల్ కూడా ప్రతీకార దాడులను ముమ్మరం చేసింది. లెబనాన్‌లోని హిజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ వాయుసేన బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో పలువురు సామాన్య పౌరులు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. అమెరికా తన ‘థాడ్’ క్షిపణి రక్షణ వ్యవస్థను ఇజ్రాయెల్‌లో మోహరించినప్పటికీ, ఇరాన్ కొత్తగా ప్రయోగిస్తున్న ఈ ‘డ్యాన్సింగ్ మిస్సైళ్ల’ను అడ్డుకోవడం పెద్ద సవాలుగా మారింది.