ఖర్గ్ ఐలాండ్‌పై దాడి... అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్

Iran Warns US over Kharg Island Attack
  • ఈ దాడిని తీవ్రంగా పరిగణిస్తున్నామన్న ఇరాన్
  • తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటన
  • అమెరికాతో సంబంధం ఉన్న చమురు కంపెనీలపై దాడులు చేస్తామని హెచ్చరిక
  • ఆ కంపెనీల మౌలిక సదుపాయాలను బూడిద కుప్పలుగా మారుస్తామన్న ఇరాన్
ఖర్గ్ ఐలాండ్‌పై అమెరికా దాడి నేపథ్యంలో, ఇరాన్ అగ్రరాజ్యానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఈ దాడిని తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని తెలిపింది. దీనికి ప్రతీకారం తప్పనిసరిగా తీర్చుకుంటామని అమెరికాను హెచ్చరించింది. అమెరికాతో సంబంధం ఉన్న చమురు కంపెనీలపై దాడులు తప్పవని తెలిపింది. చమురు కంపెనీల మౌలిక సదుపాయాలను బూడిద కుప్పలుగా మారుస్తామని ప్రకటించింది.

ఖర్గ్ ఐలాండ్‌పై అమెరికా దాడిని ధృవీకరించిన ఇరాన్, చమురు మౌలిక సదుపాయాలకు మాత్రం ఎలాంటి నష్టం జరగలేదని తెలిపింది. ఈ దాడిపై ఇరాన్ సాయుధ దళాల కార్యాలయం ప్రతినిధి ఒక ప్రకటనలో స్పందించారు. తమ చమురు మౌలిక సదుపాయాలపై జరిగిన దాడిని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాంతంలో అమెరికాతో సంబంధం ఉన్న మౌలిక సదుపాయాలను తుడిచిపెట్టేస్తామని హెచ్చరించారు.

ఖర్గ్ ఐలాండ్... చమురుకు సంబంధించి ఇరాన్‌కు వ్యూహాత్మక హబ్. ఇరాన్ నుంచి ఎగుమతి అయ్యే దాదాపు 90 శాతం చమురు ఇక్కడే ప్రాసెస్ అవుతుంది. ఇలాంటి స్థావరంపై యూఎస్ సెంట్రల్ కమాండ్ తన ఆదేశాల మేరకు దాడి చేసిందని ట్రంప్ పేర్కొన్నారు. అయితే ఇక్కడి ముడి చమురు సదుపాయాల జోలికి మాత్రం వెళ్లలేదని, కేవలం సైనిక స్థావరాలనే దెబ్బతీశామని చెప్పారు. హార్ముజ్ జలసంధి వద్ద నౌకలను అడ్డుకుంటే చమురు సదుపాయాలను కూడా లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తామని ట్రంప్ హెచ్చరించారు.
Go Back to Shorts
Iran
Kharg Island
US Iran tensions
Iran oil infrastructure
America Iran conflict
Oil exports Iran

More Telugu News