ఇరాన్ డ్రోన్ దాడితో బహ్రెయిన్‌లోని చమురు టెర్మినల్‌లో మంటలు.. వీడియో ఇదిగో!
- హైఅలర్ట్ ప్రకటించిన బహ్రెయిన్ అధికారులు
- మంటలు ఆర్పేందుకు శ్రమిస్తున్న అగ్నిమాపక సిబ్బంది
- సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియోలు
ప్రస్తుతం అగ్నిమాపక దళాలు మంటలను అదుపులోకి తెచ్చేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. అయితే, భారీ స్థాయిలో చమురు నిల్వలు ఉండటంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. ఈ ఘటనతో పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో భద్రతపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
అమెరికా, ఇజ్రాయెల్ దళాలకు వ్యూహాత్మక మద్దతు ఇస్తున్న దేశాలపై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ చేసిన హెచ్చరికల నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బహ్రెయిన్ వంటి చిన్న దేశాలలోని చమురు మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా గల్ఫ్ ప్రాంతంలో ఇంధన సరఫరా వ్యవస్థను దెబ్బతీయడమే ఇరాన్ ప్రధాన ఉద్దేశ్యంగా కనిపిస్తోందన్నారు.