అమెరికా మిత్ర దేశాల్లోని టెక్ స్థావరాలను లక్ష్యంగా చేసుకోనున్న ఇరాన్
- అమెరికా టెక్ కంపెనీల మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయాలని ఐఆర్జీసీ నిర్ణయం
- టెక్ సంస్థల సాంకేతికతను ఉపయోగిస్తున్నందున వీటిని లక్ష్యంగా చేసుకుంటున్న ఇరాన్
- గూగుల్, మైక్రోసాఫ్ట్, ఐబీఎం, ఎన్విడియా, ఒరాకిల్, పాలంటీర్ వంటి సంస్థలను లక్ష్యంగా చేసుకుంటున్న ఇరాన్
ప్రముఖ సెర్చింజన్ సంస్థ గూగుల్, మైక్రోసాఫ్ట్, ఐబీఎం, ఎన్విడియా, ఒరాకిల్, పాలంటీర్ వంటి టెక్ సంస్థలు, గల్ఫ్ దేశాల్లో క్లౌడ్ ఆధారిత సేవలు అందిస్తున్న కొన్ని కార్యాలయాలు ఈ జాబితాలో ఉన్నట్లు తెలిపింది. అమెరికా, ఇజ్రాయెల్‌లకు సంబంధించిన బ్యాంకులు, ఆర్థిక సంస్థలను లక్ష్యంగా చేసుకుంటామని పేర్కొంది. ఇందుకోసం శత్రువులు తమకు స్వేచ్ఛ కల్పించారని అన్నారు. ఆయా ప్రదేశాలకు ఒక కిలోమీటరు పరిధిలో ప్రజలు ఉండవద్దని ఇరాన్ హెచ్చరించింది.