Anthropic: 'ఆంత్రోపిక్' పేరుపై వివాదం.. అమెరికా ఏఐ దిగ్గజానికి కోర్టులో ఎదురుదెబ్బ
- 'ఆంత్రోపిక్' పేరుపై ట్రేడ్‌మార్క్ వివాదం
- అమెరికా సంస్థతో పాటు భారత విభాగానికీ కోర్టు ఆదేశాలు
- తాము వేరే సంస్థ అంటూ వాదించిన ఆంత్రోపిక్ ఇండియా
- వాదనను తోసిపుచ్చి కేసులో చేర్చిన న్యాయస్థానం
- ఇకపై రెండు కంపెనీలు విచారణకు హాజరుకావాల్సిందేనన్న ఆంత్రోపిక్ సాఫ్ట్‌వేర్ సంస్థ యజమాని
'ఆంత్రోపిక్' పేరుపై నడుస్తున్న ట్రేడ్‌మార్క్ ఉల్లంఘన కేసులో ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సంస్థ ఆంత్రోపిక్ పీబీసీకి, దాని భారత అనుబంధ సంస్థ ఆంత్రోపిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు కర్ణాటకలోని బెళగావి కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఇకపై ఈ రెండు కంపెనీలు కేసు విచారణకు హాజరుకావాల్సిందేనని ఆంత్రోపిక్ సాఫ్ట్‌వేర్ వ్యవస్థాపకుడు మహమ్మద్ అయాజ్ ముల్లా మంగళవారం వెల్లడించారు. ఈ కేసును దాఖలు చేసింది ముల్లాకు చెందిన సంస్థే కావడం గమనార్హం.
ఈ కేసుకు సంబంధించి మార్చి 9న జరిగిన విచారణ వివరాలను అయాజ్ ముల్లా ఐఏఎన్ఎస్‌తో పంచుకున్నారు. "గత విచారణలో మేము ఆంత్రోపిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు సమన్లు జారీ చేశాం. మార్చి 9న వారు కోర్టు ముందు హాజరయ్యారు. అయితే, కేసులో ప్రతివాదిగా ఉన్నది అమెరికాకు చెందిన ఆంత్రోపిక్ పీబీసీ అని, తాము వేరే చట్టపరమైన సంస్థ అని ఆంత్రోపిక్ భారత అనుబంధ సంస్థ వాదించింది" అని ముల్లా వివరించారు. ఈ వాదనతో కేసు నుంచి తప్పించుకోవాలని వారు ప్రయత్నించినట్లు ఆయన తెలిపారు.
కేసు నమోదు చేసినప్పటి నేపథ్యాన్ని ముల్లా వివరిస్తూ, "మేము ఈ ఏడాది జనవరి ఆరంభంలో కేసు దాఖలు చేసినప్పుడు, ఆంత్రోపిక్ భారత అనుబంధ సంస్థ ఇంకా నమోదు కాలేదు. అందుకే మేము నేరుగా అమెరికా కంపెనీని ప్రతివాదిగా చేర్చాం. అయితే, ఆంత్రోపిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ జనవరి చివరిలో రిజిస్టర్ అయింది" అని అన్నారు. ఇప్పుడు ఆ సంస్థకు భారత్‌లో కార్యాలయం ఉన్నందున, సమన్లను స్థానిక చిరునామాకు పంపినట్లు తెలిపారు. అయితే, తాము సాంకేతికంగా వేర్వేరు కంపెనీలమని, కాబట్టి ఈ కేసు తమకు వర్తించదని భారత విభాగం ప్రతినిధులు వాదించారని ఆయన వెల్లడించారు.
ఈ వాదనను తాము కోర్టులో వ్యతిరేకించామని ముల్లా చెప్పారు. "వారి వాదనను అడ్డుకుని, భారత అనుబంధ సంస్థను కూడా ఈ కేసులో చేర్చాలని (ఇంప్లీడ్) మేము కోరాం. మా అభ్యర్థనను కోర్టు అంగీకరించింది. దీంతో కేసును విజయవంతంగా కొనసాగించే అవకాశం మాకు లభించింది" అని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఇకపై జరగబోయే విచారణలకు అమెరికా మాతృసంస్థతో పాటు భారత అనుబంధ సంస్థ కూడా హాజరై సమాధానం చెప్పాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
ఈ కేసులో పూర్తి భారతీయ సంస్థగా ఉన్న ఆంత్రోపిక్ సాఫ్ట్ వేర్ సంస్థ... అంతర్జాతీయ టెక్ దిగ్గజం ఆంత్రోపిక్ తోనూ, దాని భారత అనుబంధ సంస్థతోనూ చేస్తున్న ఈ న్యాయపోరాటం ఆసక్తిని రేపుతోంది. ఆంత్రోపిక్ ట్రేడ్‌మార్క్ తమదేనని అయాజ్ ముల్లా చెబుతున్నారు. 2017 నుంచే తాము ఆంత్రోపిక్ అనే పేరును ఉపయోగిస్తున్నామని తెలిపారు.