Hardik Pandya: టీమిండియా గెలిచాక... గర్ల్ ఫ్రెండ్ తో సందడి చేసిన హార్దిక్ పాండ్యా... ఫొటోలు ఇవిగో!
- టీ20 ప్రపంచకప్ 2026 విజేతగా నిలిచిన టీమిండియా
- అహ్మదాబాద్ వేదికగా అంబరాన్నంటిన సంబరాలు
- మైదానంలో ప్రియురాలు మహికా శర్మతో హార్దిక్ హ్యాపీ మూమెంట్స్
అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఐసీసీ మెన్స్ టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించి, విశ్వవిజేతగా నిలిచింది. ఆదివారం (మార్చి 8) నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ అనంతరం భారత ఆటగాళ్ళు, అభిమానులు విజయోత్సవాల్లో మునిగి తేలారు. ఈ చారిత్రక విజయం తర్వాత టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా చేసిన సెలబ్రేషన్స్ ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
కప్ గెలిచిన ఆనందంలో హార్దిక్ పాండ్యా మైదానంలోనే తన గర్ల్ ఫ్రెండ్ మహికా శర్మతో కలిసి సందడి చేశారు. స్టేడియంలో వీరిద్దరూ కలిసి విజయాన్ని ఆస్వాదిస్తున్న దృశ్యాలు కెమెరాలకు చిక్కాయి. విశ్వవిజేతగా నిలిచిన తరుణంలో హార్దిక్ తన ఆనందాన్ని, ఎమోషన్స్‌ని మహికా శర్మతో పంచుకోవడం అక్కడున్న వారిని, టీవీల్లో వీక్షిస్తున్న అభిమానులను ఆకట్టుకుంది.
స్వదేశంలో, అందునా ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంలో ఈ మెగా టోర్నీని గెలుచుకోవడం పట్ల భారత జట్టు సభ్యులు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా, మహికా శర్మల సెలబ్రేషన్ పిక్చర్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతున్నాయి. ఈ విజయం భారత క్రికెట్ చరిత్రలో మరో సువర్ణ అధ్యాయంగా నిలిచిపోనుందని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.