ఏపీ హైకోర్టుకు తొలి మహిళా సీజే .. చరిత్ర సృష్టించనున్న లీసా గిల్
- పంజాబ్, హర్యానా హైకోర్టు నుంచి ఆమె బదిలీకి కేంద్రం ఆమోదం
- ప్రస్తుత సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఏప్రిల్‌లో పదవీ విరమణ
- ముందుగా న్యాయమూర్తిగా చేరి, ఆ తర్వాత సీజేగా బాధ్యతలు స్వీకరించనున్న లీసా గిల్
ప్రస్తుత ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఏప్రిల్ 24న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో జస్టిస్ లీసా గిల్ బాధ్యతలు చేపడతారు. జస్టిస్ లీసా గిల్ తొలుత ఏపీ హైకోర్టులో న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేసి, జస్టిస్ ఠాకూర్ పదవీ విరమణ అనంతరం ఆమె ప్రధాన న్యాయమూర్తిగా పూర్తిస్థాయి బాధ్యతలు చేపడతారు. ఈ నియామకంతో ఏపీ హైకోర్టుకు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ రికార్డు సృష్టించనున్నారు. 2014 నుంచి ఆమె పంజాబ్, హర్యానా హైకోర్టులో న్యాయమూర్తిగా సేవలు అందిస్తున్నారు.