ఐరిస్ దేనాను ముంచివేయడానికి ముందే, మరో ఇరాన్ యుద్ధ నౌకకు భారత్ ఆశ్రయం

Iran Navy Ship IRIS Lavan Gets Shelter in India After IRIS Dena Sinking
  • శ్రీలంక తీరంలో ఐరిస్ దేనాను ముంచివేసిన అమెరికా
  • అంతకుముందే, మరో నౌకను కొచ్చిలో నిలిపేందుకు అనుమతి కోరిన ఇరాన్
  • మరుసటి రోజే అనుమతి ఇచ్చిన భారత అధికారులు
భారత తీరానికి వచ్చిన ఇరాన్ యుద్ధ నౌకకు నిలిపేందుకు అధికారులు అనుమతి ఇచ్చారు. శ్రీలంక తీరంలో ఇరాన్ యుద్ధ నౌక ఐరిస్ దేనాను మూడు రోజుల క్రితం అమెరికా ముంచివేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మరో ఇరాన్ యుద్ధ నౌకకు భారత్ అనుమతి ఇచ్చిన విషయం వెలుగు చూసింది. ఐరిస్ లావన్ పేరు గల యుద్ధ నౌక కొచ్చి తీరానికి వచ్చింది. ఇది కూడా మన దేశంలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూకు వచ్చింది.

ఈ యుద్ధ నౌక తిరుగు ప్రయాణమైనప్పటికీ, మార్గమధ్యలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీనితో కొచ్చిలో దీనిని నిలిపేందుకు ఫిబ్రవరి 28న ఇరాన్ అధికారులు అనుమతి కోరారు. భారత అధికారులు మరుసటి రోజే దీనికి అనుమతి ఇచ్చినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఈ నౌక సహా అందులోని 183 మంది సిబ్బంది కొచ్చిలో ఆశ్రయం పొందుతున్నారు. 
Go Back to Shorts
Iran Navy
IRIS Lavan
India
Kochi
Naval Ship
International Fleet Review
IRIS Dena
Sri Lanka

More Telugu News