Arava Sridhar: ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ను బెదిరించిన కేసు.. హైకోర్టులో హర్షవీణకు ఊరట
- రైల్వేకోడూరు ఎమ్మెల్యే బెదిరింపుల కేసులో హర్ష వీణకు ముందస్తు బెయిల్
- పలు షరతులు విధిస్తూ బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు
- రూ.25 కోట్లు డిమాండ్ చేశారన్న ఆరోపణలపై నమోదైన కేసు
- వారం రోజుల్లో మేజిస్ట్రేట్ ముందు హాజరుకావాలని ఆదేశం
రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ను బెదిరించి, డబ్బు డిమాండ్ చేశారన్న ఆరోపణలతో నమోదైన కేసులో పంచాయతీరాజ్ జూనియర్ అసిస్టెంట్ హర్ష వీణకు హైకోర్టులో ఊరట లభించింది. ఆమెకు షరతులతో కూడిన ముందస్తు బెయిల్‌ను మంజూరు చేస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ఉత్తర్వులు జారీ చేశారు.
ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తల్లి ప్రమీల చేసిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు హర్ష వీణపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. 'నా కుమారుడు, అతని కుటుంబంతో పరిచయం పెంచుకున్న హర్ష వీణ, రూ.25 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసింది. డబ్బు ఇవ్వకపోతే ఎమ్మెల్యేతో అక్రమ సంబంధం ఉందంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తానని బెదిరించింది' అని ప్రమీల తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే, ఈ కేసులో అరెస్టు కాకుండా ఉండేందుకు హర్ష వీణ ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు.
పిటిషన్‌ను విచారించిన ఉన్నత న్యాయస్థానం పలు కఠిన షరతులతో బెయిల్ మంజూరు చేసింది. వారం రోజుల్లోగా సంబంధిత మేజిస్ట్రేట్ ముందు లొంగిపోయి, రూ.20 వేల చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశించింది. చార్జ్‌షీట్ దాఖలు చేసే వరకు ప్రతి శనివారం పోలీస్ స్టేషన్‌లో హాజరుకావాలని, పాస్‌పోర్ట్‌ను కోర్టుకు అప్పగించాలని స్పష్టం చేసింది. విచారణకు సహకరించాలని, సాక్షులను ప్రభావితం చేయవద్దని, కోర్టు అనుమతి లేకుండా జిల్లా విడిచి వెళ్లరాదని షరతులు విధించింది. ఈ షరతులను ఉల్లంఘిస్తే బెయిల్‌ను రద్దు చేసేందుకు చర్యలు తీసుకోవచ్చని పోలీసులకు వెసులుబాటు కల్పించింది.