Chandrababu Naidu: హెరిటేజ్‌పై ఆరోపణలు... అసెంబ్లీలో క్లారిటీ ఇచ్చిన సీఎం చంద్రబాబు
- కల్తీ నెయ్యి వ్యవహారంలో హెరిటేజ్‌పై ఆరోపణలను తీవ్రంగా ఖండించిన సీఎం చంద్రబాబు
- అసెంబ్లీలో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వాస్తవాల వెల్లడి
- హెరిటేజ్ ప్రభుత్వానికి ఎలాంటి ఉత్పత్తులు సరఫరా చేయలేదని స్పష్టం
- భారతీ సిమెంట్స్‌పై ప్రస్తావన తెచ్చి గత ప్రభుత్వంపై ఎదురుదాడి
- హైందవ ధర్మంపై పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు పూర్తి మద్దతు
అసెంబ్లీలో కల్తీ నెయ్యి వ్యవహారంపై లఘు చర్చ జరిగింది. తమ కుటుంబ సంస్థ అయిన హెరిటేజ్ ఫుడ్స్‌పై వస్తున్న ఆరోపణలను ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ఈ వ్యవహారంలో హెరిటేజ్‌ను అప్రతిష్ఠపాలు చేసేందుకు దురుద్దేశపూర్వకంగా కుట్ర జరుగుతోందని ఆరోపిస్తూ, సభలో పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వాస్తవాలను వివరించారు.
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, "హెరిటేజ్ సంస్థ మా కుటుంబ వ్యాపారం. ప్రభుత్వ సహకారం లేకుండా నీతి, నిజాయతీతో నిలబడింది. ఇప్పటివరకు హెరిటేజ్ నుంచి ఒక్క కేజీ నెయ్యిని కూడా ప్రభుత్వ శాఖలు కొనుగోలు చేయలేదు. అయినా వారి పత్రికలో మా సంస్థపై వ్యతిరేక కథనాలు రాశారు. రోజూ 20 లక్షల లీటర్ల పాలు సేకరిస్తూ నిజాయతీగా వ్యాపారం చేస్తున్నాం" అని స్పష్టం చేశారు. నెయ్యి వ్యవహారాన్ని హెరిటేజ్ డెయిరీకి ముడిపెట్టే ప్రయత్నాన్ని ఆయన తప్పుబట్టారు.
వివాదానికి కేంద్రంగా ఉన్న పూణేలోని ఇందాపూర్ డెయిరీ గురించి సీఎం వివరణ ఇచ్చారు. "ఇందాపూర్ డెయిరీ అనేది ఒక ప్రసిద్ధ కో-మాన్యుఫ్యాక్చరింగ్ సంస్థ. అది కేవలం హెరిటేజ్‌కు మాత్రమే కాకుండా మదర్ డెయిరీ, బ్రిటానియా, పతంజలి, డిమార్ట్, రిలయన్స్, దొడ్ల, అముల్ వంటి అనేక పెద్ద కంపెనీలకు ఉత్పత్తులను తయారు చేసి సరఫరా చేస్తోంది. అలాంటి సంస్థపై ఆరోపణలు చేస్తూ, దానికి హెరిటేజ్‌ను ముడిపెట్టడం దురదృష్టకరం" అని చంద్రబాబు తెలిపారు.
గత ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. "భారతీ సిమెంట్స్‌ను ప్రభుత్వ హౌసింగ్ పథకాలు, ఇతర ప్రాజెక్టులలో వినియోగించారు కదా?" అని ప్రశ్నించారు. నేరస్తులు ఏ విధంగా ఇతరులను దెబ్బతీయడానికి ప్రయత్నిస్తారనడానికి ఇదే పెద్ద ఉదాహరణ అని వ్యాఖ్యానించారు. రాజమండ్రిలో పాల కల్తీ ఘటనపై చర్చ జరగకుండా మండలిని అడ్డుకున్నారని గుర్తుచేశారు. "తప్పు చేసిన వాళ్లే ఇప్పుడు మమ్మల్ని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. గత పాలకులు చేసిన తప్పులను ముందు ఒప్పుకోవాలి" అని హితవు పలికారు.
దేవాలయాల పవిత్రతను దెబ్బతీయవద్దని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. హైందవ ధర్మంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నానని చంద్రబాబు ప్రకటించారు. ఏ మతానికి చెందిన వారి మనోభావాలను దెబ్బతీసే అధికారం ఎవరికీ లేదని ఆయన స్పష్టం చేశారు. ఎన్టీఏ కూటమి ప్రభుత్వం కల్తీ ఘటనలపై చర్చించి కఠిన చర్యలు తీసుకుంటుందని, హెరిటేజ్ వంటి సంస్థలు ఎప్పుడూ తప్పుడు పనులు చేయవని భరోసా ఇచ్చారు.