నక్సల్స్ ను ఏరివేసినట్లే చొరబాటుదారులను కూడా ఏరివేయడం సాధ్యమే: అమిత్ షా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నక్సల్స్ ను ఏరివేసినట్లే చొరబాటుదారులను కూడా ఏరివేయడం సాధ్యమే: అమిత్ షా

Infiltrators can be eliminated like Naxalites
  • అక్రమ వలసదారులను ఓటరు జాబితా నుంచే కాదు దేశం నుంచి తొలగిస్తామన్న అమిత్ షా
  • అక్రమ వలసదారులను బహిష్కరిస్తామని రాహుల్ గాంధీ చెప్పారన్న అమిత్ షా
  • కానీ కాంగ్రెస్‌కు వారే ఓటు బ్యాంకు కాబట్టి పంపించలేరని విమర్శ
నక్సల్స్ ను ఏరివేసినట్లే చొరబాటుదారులను కూడా ఏరివేయడం సాధ్యమేనని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. అసోంలోని కామ్‌రూప్‌లో పోలీస్ శాఖ 10వ బెటాలియన్ కొత్త క్యాంపస్‌కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అక్రమ వలసదారులను కేవలం ఓటరు జాబితా నుంచి మాత్రమే కాదని, దేశం నుంచి కూడా తొలగిస్తామని అన్నారు.

చొరబాటుదారులు ఆక్రమించిన స్థలాల నుంచి వారిని తరిమికొడితే మరోచోట నివాసం ఏర్పరుచుకునే అవకాశం ఉందని, కాబట్టి వారిని దేశం నుంచే పంపించివేయాలని అన్నారు. అక్రమ వలసదారులను బహిష్కరిస్తామని గతంలో కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ చెప్పారని గుర్తుచేశారు. వారు చెప్పిన మాటలు విశ్వసించవద్దని, ఎందుకంటే వారికి చొరబాటుదారులే ఓటు బ్యాంకు కాబట్టి వారిని పంపించలేరని అన్నారు.

చొరబాటుదారులను రక్షించాలనే హస్తం పార్టీ విధానాలు అసోంకు ముప్పుగా పరిణమించాయని విమర్శించారు. ఒకవేళ వారిపై చర్యలు తీసుకునే విషయానికి వస్తే కాంగ్రెస్ కట్టుబడి ఉంటే పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఆ విషయాన్ని పొందుపర్చాలని డిమాండ్ చేశారు. వచ్చే ఐదేళ్ల కాలంలో అసోంను పారిశ్రామిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని అన్నారు.
Advertisement
Amit Shah
Assam
Naxalism
Illegal Immigrants
Rahul Gandhi
Congress Party
Kamrup
Voter List
Industrial Hub
Border Security

More Telugu News