Sundar Pichai: మీరే నాకు జీతం ఇస్తున్నారు సార్.. సుందర్ పిచాయ్‌తో యూట్యూబర్ సరదా ముచ్చట

YouTuber Anant Ladhas Fanboy Moment with Sundar Pichai
  • ఏఐ సదస్సులో సుందర్ తో యూట్యూబర్ పలకరింపు
  • 'అదెలా?' అంటూ కొద్దిగా ఆశ్చర్యపోయిన గూగుల్ సీఈఓ
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026’లో ఓ యూట్యూబర్ కు సర్ ప్రైజ్ ఎదురైంది. ఏకంగా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ పక్కన కూచునే అవకాశం దక్కింది. తన సీటుకు రెండు సీట్ల అవతల ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన వ్యక్తి కూర్చోవడంతో ఆ యూట్యూబర్ సంతోషం మామూలుగా లేదు. తిన్నగా ఆయన వద్దకు వెళ్లి ‘నమస్తే సార్.. మీరే నాకు నెలనెలా డబ్బులు ఇస్తున్నారు’ అంటూ పలకరించాడు.

దీనికి ఆశ్చర్యపోయిన సుందర్ పిచాయ్.. అదెలాగని ప్రశ్నించగా తానో యూట్యూబర్ నని, నెలనెలా యూట్యూబ్ నుంచి ఆదాయం పొందుతున్నానని చెప్పడంతో ఆయన కూడా నవ్వేశారు. అనంత్ లధా అనే యూట్యూబర్ కు ఎదురైందీ అనుభవం. ఈ విషయాన్ని ఆయన తన ఎక్స వేదికగా పంచుకోవడంతో ఆ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

చార్టర్డ్ అకౌంటెంట్ నుంచి యూట్యూబర్‌ గా మారిన అనంత్ లధా.. ‘ఇన్వెస్ట్ ఆజ్ ఫర్ కల్’ అనే ప్లాట్‌ఫారమ్ నడుపుతున్నారు. ఏఐ సదస్సులో సుందర్ పిచాయ్‌తో కలిసి దిగిన సెల్ఫీని షేర్ చేస్తూ తన ‘ఫ్యాన్ బాయ్’ మూమెంట్ గురించి ఎక్స్ లో పోస్ట్ చేశారు. సదస్సులో సుందర్ పిచాయ్ పక్కనే కూర్చునే అవకాశం రావడంతో అనంత్ ఆయనతో మాటలు కలిపానని చెప్పారు.

నెటిజన్ల ప్రశంసలు

ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు సుందర్ పిచాయ్ సింప్లిసిటీని మెచ్చుకుంటూ కామెంట్లు పెడుతున్నారు. ‘‘బిజీ షెడ్యూల్‌ లోనూ సామాన్య వ్యక్తులతో ఆయన మాట్లాడే విధానం అద్భుతం’’ అని ఒకరు, ‘‘తర్వాతి వంతు జుకర్‌ బర్గ్ లేదా ఎలాన్ మస్క్ అనుకుంటా.. వారు కూడా మీకు డబ్బులు ఇస్తారుగా!’’ అంటూ మరొక నెటిజన్ చమత్కరించారు.

Sundar Pichai
Anant Ladha
India AI Impact Summit 2026
YouTube
YouTuber
Google CEO
Invest Aaj For Kal
Delhi
Social Media
Viral Post

More Telugu News