Ibomma Ravi: మీకో నమస్కారం... మీడియాతో ఒక్క ముక్క మాట్లాకుండా చిరునవ్వుతో వెళ్లిపోయిన ఐబొమ్మ రవి
- సినిమాల పైరసీ కేసులో ఐబొమ్మ రవికి షరతులతో కూడిన బెయిల్
- చంచల్‌గూడ జైలు నుంచి బుధవారం సాయంత్రం విడుదల
- మీడియా ప్రశ్నలకు మౌనంగా, చిరునవ్వుతోనే సమాధానం
- పాస్‌పోర్టు స్వాధీనం చేసి, రోజూ పోలీస్ స్టేషన్‌లో హాజరు కావాలని షరతు
- గతేడాది నవంబర్‌లో అరెస్ట్ కాగా, 90 రోజులుగా జైలులో ఉన్న రవి
సినిమాల పైరసీ కేసులో ఐబొమ్మ వెబ్ సైట్ నిర్వాహకుడు ఇమంది రవికి తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడం తెలిసిందే. సినిమాల పైరసీ కేసులో అరెస్టయిన ‘ఐబొమ్మ’ రవి చంచల్‌గూడ జైలు నుంచి విడుదలయ్యాడు. తెలంగాణ హైకోర్టు మంగళవారం అతడికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దీంతో బుధవారం సాయంత్రం రవి జైలు నుంచి బయటకు వచ్చాడు. అయితే జైలు నుంచి బయటికి వచ్చిన సందర్భంగా మీడియా అతడిని మాట్లాడించే ప్రయత్నం చేసింది.
మిమ్మల్ని పైరసీ దొంగ అంటున్నారు... దానికి మీరేమంటారు అంటూ ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించాడు. అందుకు రవి చిరునవ్వే సమాధానంగా, రెండు చేతులు జోడించి నమస్కారం పెడుతూ ముందుకు సాగిపోయాడు. మీడియా ఎన్ని విధాలుగా ప్రయత్నించినా అతడు ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు. కారులో ఎక్కిన తర్వాత కూడా మీడియా ప్రతినిధులకు నమస్కారం పెడుతూ, చిరునవ్వే సమాధానం అన్నట్టుగా మౌనంగా ఉండిపోయాడు.
గతేడాది నవంబర్‌లో ఐబొమ్మ వెబ్ సైట్ ద్వారా కొత్త సినిమాలను అక్రమంగా అప్‌లోడ్ చేస్తున్నాడన్న ఆరోపణలతో సైబర్ క్రైమ్ పోలీసులు రవిని అరెస్టు చేశారు. అతనిపై ఐదు కేసులు నమోదు చేసినట్లు సమాచారం. ఈనాడు కథనం ప్రకారం, హైకోర్టు అతనికి పలు కఠిన షరతులతో బెయిల్ మంజూరు చేసింది. దేశం విడిచి వెళ్లకూడదని, తన పాస్‌పోర్టును కోర్టులో స్వాధీనం చేయాలని ఆదేశించింది. అంతేకాకుండా, ప్రతిరోజూ ఉదయం 11 గంటలకు సీసీఎస్ పోలీస్ స్టేషన్‌లో హాజరు కావాలని స్పష్టం చేసింది.