Piyush Dhamnodia: పెళ్లి గొడవతో ఎంబీఏ విద్యార్థిని హత్య.. మంత్రాలతో శవం తిరిగివస్తుందని ఆశ!

Indore MBA Student Killed by Boyfriend Piyush Dhamnodia After Fight
  • గదిలో నగ్నంగా పడి ఉన్న యువతి మృతదేహం
  • హత్య తర్వాత 'ఆత్మ' కోసం తాంత్రిక పూజలు
  • ముంబైలో నిందితుడిని పట్టుకున్న పోలీసులు
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ఓ కిరాతక ప్రియుడు తన ప్రియురాలిని అతి దారుణంగా హత్య చేశాడు. పెళ్లి విషయంలో తలెత్తిన గొడవ చివరకు ప్రాణాలు తీసే వరకు వెళ్లింది. ద్వారకాపురి ప్రాంతంలోని ఓ అద్దె గది నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఈ దారుణ ఉదంతం వెలుగులోకి వచ్చింది. పోలీసులు గది తలుపులు పగలగొట్టి చూడగా.. బెడ్‌పై యువతి మృతదేహం నగ్నంగా పడి ఉంది.

నిందితుడు పీయూష్ ధమ్నోడియా, మృతురాలు (24) ఇద్దరూ కలిసి ఎంబీఏ చదువుతున్నారు. వీరిద్దరూ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు. అయితే, పెళ్లి విషయంలో గత కొన్నాళ్లుగా గొడవలు జరుగుతున్నాయి. నిందితుడి కుటుంబ సభ్యులు పెళ్లికి నిరాకరించడంతో గొడవ పెద్దదైంది. ఫిబ్రవరి 12న గదిలో చర్చించుకుంటున్న సమయంలో మళ్లీ వాగ్వివాదం జరగడంతో ఆవేశంలో పీయూష్ ఆమెను గొంతు నులిమి చంపేశాడు.

హత్య అనంతరం నిందితుడు మహారాష్ట్రలోని పన్వేల్‌కు పారిపోయాడు. అక్కడ ఒక హోటల్ గదిలో ఉంటూ.. మంత్ర తంత్రాలతో చనిపోయిన తన ప్రియురాలి ఆత్మను తిరిగి పిలిపించవచ్చని భావించి వింత పూజలు చేసినట్లు పోలీసు విచారణలో తేలింది. ఆ తర్వాత ముంబైకి చేరుకుని లోకల్ ట్రైన్లలో తిరుగుతుండగా పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.

బాధితురాలి తండ్రి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో మరికొన్ని సంచలన విషయాలు బయటపెట్టారు. నిందితుడు తన కూతురి అశ్లీల ఫోటోలు, వీడియోలను ఆన్‌లైన్‌లో వైరల్ చేస్తానని భయపెట్టేవాడని, తన కాలేజీ ఫీజులు కట్టమని ఆమెను బ్లాక్‌మెయిల్ చేసేవాడని ఆరోపించారు. నిందితుడు ఆమె మొబైల్ ఫోన్‌ను ధ్వంసం చేయగా, పోలీసులు ఆ డిజిటల్ సాక్ష్యాల కోసం ఫోరెన్సిక్ దర్యాప్తు చేస్తున్నారు.
Piyush Dhamnodia
Indore murder
MBA student murder
love affair
crime news
marriage dispute
blackmail
forensic investigation
Panvel
Maharashtra

More Telugu News