Nara Bhuvaneswari: నారా భువనేశ్వరి టీమ్ ను అభినందించిన సీఎం చంద్రబాబు

Nara Bhuvaneswari Appreciated by CM Chandrababu for NTR Trust Services
షార్ట్స్‌లో చూడండి
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం నిరంతరం పోరాడిన మహనీయుడు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లేలా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ట్రస్ట్ స్థాపించి 29 సంవత్సరాలు పూర్తి చేసుకుని 30వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆయన ఎక్స్ వేదికగా స్పందిస్తూ ఎన్టీఆర్ ట్రస్ట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. 

అధికారం అంటే పేదల సేవ అనే భావనతో ప్రజా సేవకు నిజమైన అర్థాన్ని ఇచ్చిన ఎన్టీఆర్ గారి బాటలో ట్రస్ట్ సేవలు కొనసాగిస్తోందని చంద్రబాబు పేర్కొన్నారు. విద్య, వైద్యం, రక్తదానం, విపత్తుల్లో సహాయం వంటి కార్యక్రమాల ద్వారా ట్రస్ట్ సమాజంలో తిరుగులేని ముద్ర వేసిందన్నారు. ముఖ్యంగా తలసేమియా వ్యాధిగ్రస్త చిన్నారులకు నిరంతర సేవలు అందించడంలో ఎన్టీఆర్ ట్రస్ట్ చేస్తున్న కృషి అసామాన్యమని ప్రశంసించారు. అలాగే మహిళా సాధికారత, జీవనోపాధి కల్పనలోనూ ట్రస్ట్ కీలక సేవలు అందిస్తోందని తెలిపారు. 

ట్రస్ట్ సేవలను మరింత విస్తరిస్తూ సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్న ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి, వారి బృందాన్ని చంద్రబాబు అభినందించారు. ట్రస్ట్ కార్యక్రమాలకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఇలాగే కొనసాగుతూ కోట్ల మందికి అండగా నిలవాలని ఆకాంక్షించారు.
Go Back to Shorts
Nara Bhuvaneswari
NTR Memorial Trust
Chandrababu Naidu
Telugu Desam Party
Nandamuri Taraka Rama Rao
NTR Trust
Thalassemia
Andhra Pradesh
Charity
Social Service

More Telugu News