Mrunal Thakur: పెళ్లిపై మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Mrunal Thakur on Marriage Waiting for the Right Person
  • జీవితంలో పెళ్లి అందమైన మలుపు అన్న మృణాల్
  • పెళ్లి చేసుకోవాలంటే సరైన సమయం, సరైన వ్యక్తి అవసరమని వ్యాఖ్య
  • నచ్చిన వ్యక్తి దొరికితే ఆ విషయాన్ని తానే చెబుతానన్న మృణాల్
ఉత్తరాది భామ మృణాల్ ఠాకూర్ టాలీవుడ్, కోలీవుడ్ లో కూడా ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. మరోవైపు, మృణాల్ పెళ్లి గురించి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. తమిళ స్టార్ ధనుష్ ను ఆమె పెళ్లాడబోతోందంటూ సోషల్ మీడియా కోడై కూస్తోంది. అలాంటిది ఏమీ లేదని ఆమె స్పష్టంగా చెప్పినప్పటికీ... ఈ పుకార్లకు చెక్ పడలేదు.

ఈ అంశంపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో మృణాల్ స్పందిస్తూ... పెళ్లి అనేది జీవితంలో ఒక అందమైన మలుపు అని... తాను కచ్చితంగా పెళ్లి చేసుకుంటానని చెప్పింది. పెళ్లి చేసుకోవాలంటే సరైన వ్యక్తి, సరైన సమయం కావాలని తెలిపింది. ఎవరో అడుగుతున్నారనో, వయసు పెరిగిపోతోందనో తొందరపడి నిర్ణయం తీసుకోనని చెప్పింది. తన మనసుకు నచ్చిన వ్యక్తి దొరికితే... ఆ విషయాన్ని తానే స్వయంగా ప్రకటిస్తామని తెలిపింది. 

ఒక వ్యక్తితో జీవితాంతం కలిసి ఉండాలంటే మనసులు కలవాలని మృణాల్ అభిప్రాయపడింది. బలవంతపు బంధాల కంటే... ఇష్టమైన వ్యక్తి కలిసేంత వరకు వేచి ఉండటమే మేలని చెప్పింది. సినిమాల విషయానికి వస్తే... 'దో దినావే సెహర్ మే' సినిమాతో అలరించనుంది. టాలీవుడ్ లో అడివి శేష్ తో కలిసిన నటించిన 'డెకాయిట్' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. వీటితో పాటు మరికొన్ని చిత్రాల్లో కూడా మృణాల్ నటిస్తోంది.
Mrunal Thakur
Mrunal Thakur marriage
Dhanush
Bollywood actress
Tollywood
Tamil cinema
Dacoit movie
Adivi Sesh
Do Deenon Mein
marriage rumors

More Telugu News