కల్వకుంట్ల కవిత వర్గం హవా: ఏఐఎఫ్‌బీ తరఫున పోటీ చేసి వడ్డేపల్లి మున్సిపాలిటీ కైవసం

కల్వకుంట్ల కవిత వర్గం హవా: ఏఐఎఫ్‌బీ తరఫున పోటీ చేసి వడ్డేపల్లి మున్సిపాలిటీ కైవసం

Kalvakuntla Kavitha Group Victory in Vaddepally Municipality
  • వడ్డేపల్లి మున్సిపాలిటీలో 10 వార్డులకు గాను ఎనిమిదింటిని గెలుచుకున్న ఏఐఎఫ్‌బీ
  • ఏఐఎఫ్‌బీ నుండి పోటీ చేసి విజయం సాధించిన తెలంగాణ జాగృతి నాయకులు
  • కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ఒక్కో స్థానం
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలలో కవిత నేతృత్వంలోని తెలంగాణ జాగృతి నాయకులు ఒక మున్సిపాలిటీని దక్కించుకున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలోని వడ్డేపల్లి మున్సిపాలిటీలో తెలంగాణ జాగృతి నాయకులు ఆల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ (ఏఐఎఫ్‌బీ) తరఫున ఎన్నికల బరిలో దిగి విజయం సాధించారు.

తెలంగాణ జాగృతి నాయకులు ఏఐఎఫ్‌బీ పార్టీ తరఫున మొత్తం 10 వార్డుల్లో పోటీ చేసి 8 స్థానాల్లో విజయం సాధించారు. దీంతో వడ్డేపల్లి మున్సిపాలిటీ ఏఐఎఫ్‌బీ కైవసం చేసుకుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు చెరో వార్డును దక్కించుకున్నాయి.

ఇప్పటి వరకు వచ్చిన ఫలితాలను పరిశీలిస్తే కాంగ్రెస్ 44, బీఆర్ఎస్ 10 మున్సిపాలిటీలను కైవసం చేసుకున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థులు 884 వార్డులు, బీఆర్ఎస్ 464, బీజేపీ 136, ఇతరులు 137 స్థానాల్లో గెలుపొందారు.
Advertisement
Kalvakuntla Kavitha
Telangana Jagruthi
Vaddepally Municipality
Jogulamba Gadwal
AIFB
All India Forward Bloc

More Telugu News