Duvvada Srinivas: ఏం చేద్దాం శ్రీనివాస్?: అసెంబ్లీ బయట దువ్వాడ శ్రీనివాస్ కు జగన్ పలకరింపు

Duvvada Srinivas meets Jagan after expulsion from YSRCP
షార్ట్స్‌లో చూడండి
వైసీపీ నుంచి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ను బహిష్కరించిన సంగతి తెలిసిందే. అయితే, ఈరోజు అసెంబ్లీ ప్రాంగణంలో ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. అసెంబ్లీ నుంచి జగన్ బయటకు వస్తున్న సమయంలో ఆయనను దువ్వాడ శ్రీనివాస్ కలిశారు. ఆయనను చూసిన జగన్ పలకరించారు. ఏం చేద్దాం శ్రీనివాస్? అని ప్రశ్నించారు. మాజీ మంత్రి ధర్మానతో ఉన్న అంశాలపై మాట్లాడాలని జగన్ ను దువ్వాడ కోరారు. దీంతో, తాడేపల్లిలోని తన నివాసానికి రావాలని జగన్ ఆయనకు చెప్పారు. అక్కడి నుంచి తన కాన్వాయ్ ఎక్కి తాడేపల్లికి బయల్దేరారు.

కొన్ని వివాదాల నేపథ్యంలో ఏడు నెలల క్రితం వైసీపీ నుంచి దువ్వాడను బహిష్కరించారు. అప్పటి నుంచి పార్టీతో సంబంధం లేకుండా దువ్వాడ ఉంటున్నారు. శాసనమండలి సమావేశాలకు మాత్రం తప్పకుండా హాజరవుతున్నారు. ఈ క్రమంలో, ఈరోజు అసెంబ్లీని వాకౌట్ చేసి జగన్ వెళ్లిపోతున్న సమయంలో ఆయనకు దువ్వాడ ఎదురయ్యారు. 

జగన్ పలకరింపు అనంతరం మీడియాతో దువ్వాడ మాట్లాడుతూ... త్వరలోనే జగన్ ను కలుస్తానని, వైసీపీలో అవకాశం ఇవ్వకుంటే, సొంతంగా పోటీ చేసి తన బలం చూపిస్తానని అన్నారు. శాసనమండలిలో తన వ్యక్తిగత అజెండాతో ముందుకు వెళతానని, ప్రజా సమస్యలను ప్రస్తావిస్తానని చెప్పారు. తిరుమల లడ్డూ వ్యవహారంలో భక్తుల వైపు మాట్లాడతానని అన్నారు.
Go Back to Shorts
Duvvada Srinivas
YS Jagan
YS Jagan Mohan Reddy
YSRCP
Andhra Pradesh Assembly
Tadepalli
Dharmana Prasada Rao
MLC
Andhra Pradesh Politics
Tirumala Laddu

More Telugu News