Arjun Tendulkar: అర్జున్ వివాహం.. ప్రధాని మోదీని కలిసిన సచిన్ టెండూల్కర్ కుటుంబం

Arjun Tendulkar Wedding Sachin Tendulkar Family Meets PM Modi
  • అర్జున్, సానియా వివాహానికి రావాలంటూ ఆహ్వాన పత్రిక అందజేత
  • మార్చి 5న ముంబైలో అర్జున్, సానియా వివాహం
  • మోదీని కలిసిన ఫొటోలను షేర్ చేసిన సచిన్ టెండూల్కర్
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కుటుంబంతో సహా ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. తన తనయుడు అర్జున్ టెండూల్కర్ వివాహానికి రావాలంటూ ఆహ్వాన పత్రికను అందించారు. ప్రధాని మోదీతో కలిసి దిగిన ఫొటోలను ఆయన సామాజిక మాధ్యమంలో పంచుకున్నారు. సానియా చందోక్‌తో అర్జున్ టెండూల్కర్ వివాహం మార్చి 5న ముంబైలో జరగనుంది.

ప్రధాని మోదీని కలిసి అర్జున్, సానియా వివాహానికి ఆహ్వానించడాన్ని తాము గౌరవంగా భావిస్తున్నామని సచిన్ టెండూల్కర్ పేర్కొన్నారు. కాబోయే జంటను ఆశీర్వదించినందుకు ధన్యవాదాలు తెలిపారు.

ప్రధాని మోదీ వద్దకు సచిన్ కుటుంబంతో పాటు సానియా చందోక్, ఆమె తల్లిదండ్రులు కూడా వచ్చారు. మోదీ వారిని ఆత్మీయంగా పలకరించి, కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం మోదీతో ఇరు కుటుంబాలు కలిసి ఫొటో దిగాయి. అర్జున్, సానియా ప్రధాని మోదీతో ప్రత్యేకంగా ఫొటో దిగారు. ముంబైకి చెందిన వ్యాపారవేత్త రవి ఘాయ్ మనవరాలు సానియా చందోక్. ఆమె కూడా వ్యాపారవేత్త అని తెలిసిందే. 
Arjun Tendulkar
Sachin Tendulkar
Narendra Modi
Sania Chandok
Arjun Sania Wedding
Indian Cricket

More Telugu News