Vaibhav Suryavanshi: అండర్19 వరల్డ్ కప్ ఫైనల్: 50 ఓవర్లలో 411 రన్స్... సూర్యవంశీ ఎఫెక్ట్ తో భారత్ కళ్లు చెదిరే స్కోరు
- ఫైనల్లో చెలరేగిన భారత యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ
- 80 బంతుల్లో 15 ఫోర్లు, 15 సిక్సర్లతో 175 పరుగుల విధ్వంసం
- ఇంగ్లండ్ ముందు 412 పరుగుల భారీ టార్గెట్ ఉంచిన టీమిండియా
- కెప్టెన్ ఆయుష్ మాత్రే, అభిగ్యాన్ కుందు కీలక ఇన్నింగ్స్‌లతో రాణింపు
- ఇంగ్లండ్ బౌలర్లను ఉతికారేసిన భారత బ్యాటర్లు
అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్లో భారత యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ సృష్టించిన విధ్వంసం అంతా ఇంతా కాదు. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తుదిపోరులో సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగడంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 411 పరుగుల రికార్డు స్కోరు సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. సెమీఫైనల్ సెంచరీ హీరో ఓపెనర్ ఆరోన్ జార్జ్ (9) కేవలం 20 పరుగుల వద్దే పెవిలియన్ చేరాడు. ఈ దశలో వైభవ్ సూర్యవంశీ, ఇంగ్లండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు.
సూర్యవంశీ తన తుపాను ఇన్నింగ్స్‌లో కేవలం 80 బంతులు ఎదుర్కొని 15 ఫోర్లు, 15 భారీ సిక్సర్లతో ఏకంగా 175 పరుగులు చేశాడు. 218.75 స్ట్రైక్ రేట్‌తో అతను చూపించిన విశ్వరూపానికి ఇంగ్లండ్ బౌలర్లు బెంబేలెత్తిపోయారు. మైదానం నలువైపులా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. మరోవైపు, కెప్టెన్ ఆయుష్ మాత్రే (51 బంతుల్లో 53) అతనికి అండగా నిలిచాడు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్‌కు 90 బంతుల్లోనే 142 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆ తర్వాత వేదాంత్ త్రివేదితో కలిసి మూడో వికెట్‌కు సూర్యవంశీ 89 పరుగులు జోడించాడు.
మాత్రే, సూర్యవంశీ అవుటయ్యాక కూడా భారత బ్యాటర్లు అదే జోరును కొనసాగించారు. వేదాంత్ త్రివేది (32), విహాన్ మల్హోత్రా (30) ఫర్వాలేదనిపించారు. చివర్లో వికెట్ కీపర్ అభిగ్యాన్ కుందు (31 బంతుల్లో 40), కనిష్క్ చౌహాన్ (20 బంతుల్లో 37 నాటౌట్) మెరుపులు మెరిపించడంతో భారత స్కోరు 400 పరుగుల మార్కును దాటింది. వీరి ధాటికి భారత జట్టు చివరి 10 ఓవర్లలో వందకు పైగా పరుగులు రాబట్టింది.
భారత బ్యాటర్ల విధ్వంసానికి ఇంగ్లండ్ బౌలర్లు చేతులెత్తేశారు. జేమ్స్ మింటో 3 వికెట్లు పడగొట్టినప్పటికీ 63 పరుగులు సమర్పించుకున్నాడు. సెబాస్టియన్ మోర్గాన్, అలెక్స్ గ్రీన్ చెరో రెండు వికెట్లు తీశారు. మ్యానీ లమ్స్‌డెన్ 8 ఓవర్లలోనే 81 పరుగులు ఇచ్చి అత్యంత ఖరీదైన బౌలర్‌గా నిలిచాడు. ఫర్హాన్ అహ్మద్ తన 10 ఓవర్లలో 77 పరుగులు ఇచ్చాడు.