Prakash Raj: ప్రకాశ్ రాజ్ బావ అంటే ఇష్టం: డిస్కోశాంతి సోదరి సుచిత్ర!
- డిస్కో శాంతి చెల్లెలు సుచిత్ర
- అక్కనే అందరినీ ఆదుకుందని వెల్లడి
- శ్రీహరి వ్యక్తిత్వం గొప్పదని వ్యాఖ్య
- ప్రకాశ్ రాజ్ బావ మనసు మంచిదని వివరణ
డిస్కో శాంతికి సుచిత్ర అనే ఒక చెల్లెలు ఉందనే విషయం చాలామందికి తెలియదు. అందుకు కారణం ఆమె నటనకి దూరంగా ఉంటూ రావడమే. అలాంటి ఆమె మోడలింగ్ వైపు నుంచి నిదానంగా సినిమా రంగంలోకి అడుగుపెట్టారు. నెగెటివ్ షేడ్స్ తో కూడిన ఒక పాత్ర ద్వారా ఆమె ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ నేపథ్యంలో 'సుమన్ టీవీ'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకి సంబంధించిన అనేక విషయాలను గురించి ఆమె ప్రస్తావించారు.
"మా నాన్న ఆనందన్ గారు తమిళ .. మలయాళ .. కన్నడ సినిమాలు చేశారు. మేము మొత్తం 7 మంది సంతానం. బంగళాలు .. కార్లు .. విలాసవంతమైన జీవితాన్ని అనుభవించాము. ఫాదర్ చనిపోయిన తరువాత కుటుంబ బాధ్యతలను శాంతి అక్కయ్యనే ఎక్కువగా మోస్తూ వచ్చింది. వివాహమైన తరువాత కూడా ఆమె మమ్మల్ని చూసుకుంది. అందుకు శ్రీహరి బావ కూడా ఎప్పుడూ అడ్డుచెప్పలేదు. నిజంగా అది చాలా గొప్ప విషయం" అని అన్నారు.
"శ్రీహరి బావ చనిపోయిన తరువాత కూడా, మా కుటుంబంలో ఎవరికీ ఎలాంటి అవసరం వచ్చినా శాంతి అక్క ఆదుకుంటూనే వచ్చింది. నా పెళ్లి చేసింది కూడా తనే. శ్రీహరి బావ చాలా మంచివారే. అయితే నేను .. మా అమ్మ ఎక్కువగా ఉన్నది లతక్క .. ప్రకాశ్ రాజ్ బావ దగ్గరే. అందువలన నాకు ప్రకాశ్ రాజ్ బావ అంటే ఇష్టం. ఇక శ్రీహరి బావ చనిపోవడం, లతక్క నుంచి ప్రకాశ్ రాజ్ బావ విడాకులు తీసుకుని వెళ్లిపోవడంతో మా ఫ్యామిలీ మళ్లీ కోలుకోని దెబ్బతిన్నట్టుగా అనిపించింది" అని చెప్పారు.