Donald Trump: నువ్వో చెత్త రిపోర్టర్‌వి... నువ్వు నవ్వగా ఎప్పుడూ చూడలేదు: మహిళా జర్నలిస్టుపై ట్రంప్ ఆగ్రహం
- ఓ కుంభకోణానికి సంబంధించి కొత్తగా విడుదలైన పత్రాల గురించి ప్రశ్నించిన సీఎన్ఎన్ రిపోర్టర్
- మీలాంటి వారి వల్లే సీఎన్ఎన్ రేటింగ్ పడిపోతుందంటూ ట్రంప్ ఆగ్రహం
- ఇలాంటి విషయాల గురించి కాకుండా దేశం గురించి ఆలోచిస్తే మంచిదని హితవు
"పదేళ్లుగా మిమ్మల్ని చూస్తున్నాను. కానీ ఎప్పుడూ నవ్వుతుండటం చూడలేదు" అని ఒక మహిళా జర్నలిస్టును ఉద్దేశించి అమెరికా అద్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. అమెరికా అధ్యక్ష భవనంలోని ఓవల్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఈ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. సీఎన్ఎన్ ఛానల్ రిపోర్టరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓ కుంభకోణానికి సంబంధించి కొత్తగా విడుదలైన పత్రాల గురించి సీఎన్ఎన్ ఛానల్‌కు చెందిన కైట్లాన్ కొల్లిన్స్ అనే మహిళా జర్నలిస్టు ట్రంప్‌ను ప్రశ్నించారు. ఆగ్రహానికి గురైన ట్రంప్ 'నువ్వో చెత్త రిపోర్టర్‌వు' అని విమర్శించారు. మీలాంటి వారి వల్లే సీఎన్ఎన్ రేటింగ్ పడిపోతుందని, మీరు ఎప్పుడూ నిజాలు చెప్పరని అందరికీ తెలుసని అన్నారు.
అందుకే మీరు ఎప్పుడూ సీరియస్‌గా ఉంటారని అన్నారు. మీలాంటి రిపోర్టర్‌ను అట్టిపెట్టుకున్నందుకు ఛానల్ సిగ్గుపడాలని అన్నారు. ఈ కుంభకోణం కేసులో తనతో సహా ఇతరుల పేర్లను కుట్రపూరితంగా విడుదల చేశారని అన్నారు. ఇప్పుడు ఇటువంటి విషయాల గురించి కాకుండా దేశం గురించి ఆలోచిస్తే మంచిదని అన్నారు.