Lalit Modi: వరల్డ్ కప్‌లో 'పాక్' డ్రామా క్రికెట్‌కు నష్టం.. ఐపీఎల్‌కి లాభం: లలిత్ మోదీ సంచలన వ్యాఖ్యలు
- రాజకీయాల వల్ల క్రికెట్ స్ఫూర్తి దెబ్బతింటోందన్న లలిత్ మోదీ
- బాయ్‌కాట్ చేస్తే ఐసీసీ ఆదాయానికి భారీ గండి తప్పదని వ్యాఖ్య
- ఈ వివాదంలో ఏకైక విజేత ఐపీఎల్ మాత్రమేనన్న ఐపీఎల్ మాజీ చైర్మన్
వచ్చే టీ20 వరల్డ్ కప్‌లో భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్థాన్ తీసుకున్న నిర్ణయంపై ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. క్రీడల్లోకి రాజకీయాలు ప్రవేశిస్తే నష్టపోయేది ఆట మాత్రమేనని ఆవేదన వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 15న కొలంబోలో జరగాల్సిన ఈ హై-వోల్టేజ్ మ్యాచ్ నుంచి తప్పుకోవాలని పాక్ ప్రభుత్వం తమ జట్టును ఆదేశించిన నేపథ్యంలో లలిత్ మోదీ ఐఏఎన్ఎస్‌తో మాట్లాడారు.
"క్రికెట్ అనేది మైదానంలో ఆడి గెలవాల్సిన ఆట, బోర్డు రూముల్లో చర్చలతోనో లేదా బహిష్కరణలతోనో నిర్ణయించేది కాదు. రాజకీయాల వల్ల ఆట ఓడిపోతుంది కానీ, పోటీని కాంక్షించే క్రీడాకారులను, అభిమానులను ప్రపంచం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది" అని మోదీ వ్యాఖ్యానించారు.
పాక్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల అంతర్జాతీయ క్రికెట్ మండలి ఆదాయానికి, బ్రాడ్‌కాస్టర్ల నమ్మకానికి గండి పడుతుందని లలిత్ మోదీ హెచ్చరించారు. "ద్వైపాక్షిక సిరీస్‌లు, ఐసీసీ టోర్నీల ప్రసార హక్కుల విలువ పడిపోయే ప్రమాదం ఉంది. ఇలాంటి అనిశ్చితి వల్ల స్పాన్సర్లు వెనకడుగు వేస్తారు. ఈ గందరగోళంలో చివరకు లబ్ధి పొందేది ఐపీఎల్ మాత్రమే. ఇప్పటికే ప్రపంచ క్రికెట్‌లో ఐపీఎల్ ఒక బ్రాండ్‌గా ఎదిగింది. ఇప్పుడు ఇలాంటి బహిష్కరణలు దానికి మరింత బలాన్ని ఇస్తాయి" అని విశ్లేషించారు.
ఒకవేళ పాకిస్థాన్ మ్యాచ్ ఆడకపోతే, ఐసీసీ నిబంధనల ప్రకారం భారత్‌కు 2 పాయింట్లు లభిస్తాయి. పాక్ ఆడినట్లుగానే పరిగణించి వారి 'నెట్ రన్ రేట్'ను భారీగా తగ్గిస్తారు. ఇది ఆ జట్టు సెమీస్ అవకాశాలను దెబ్బతీస్తుంది. బ్రాడ్‌కాస్టర్లకు కలిగే సుమారు రూ. 200 కోట్ల నష్టాన్ని పాక్ క్రికెట్ బోర్డే భరించాలని ఐసీసీ ఆదేశించే అవకాశం ఉంది. పాక్ ప్రభుత్వం 'ఫోర్స్ మెజ్యూర్' (నియంత్రించలేని పరిస్థితులు) క్లాజును వాడుకోవాలని చూస్తున్నా.. రాజకీయ కారణాలను ఐసీసీ అంగీకరించబోదని స్పష్టం చేసింది.