మరి, మచాడోకు ట్రంప్ రిటర్న్ గిఫ్ట్ ఏమిచ్చారంటే..!
- రెడ్ కలర్ బ్యాగ్ తో వైట్ హౌస్ వీడిన మచాడో
- తన ప్రత్యేక అతిథులకు రెడ్ బ్యాగ్ అందించడం ట్రంప్ కు ఆనవాయతీ
- అందులో ట్రంప్ కు ఇష్టమైన కోక్ బాటిల్ సహా పలు వస్తువులు ఉంటాయని సమాచారం
నోబెల్ శాంతి బహుమతి ఆశించి భంగపడ్డ ట్రంప్ కు ఈ చర్య ఎంతగానో సంతోషాన్నిచ్చింది. అద్భుతమైన మహిళ అంటూ మచాడోను పొగడ్తలతో ముంచెత్తిన ట్రంప్.. ఆమెకు ఓ రెడ్ బ్యాగ్ ను కానుకగా అందజేశారు. వైట్ హౌస్ నుంచి మచాడో తిరిగి వెళుతున్నపుడు ఆమె చేతుల్లో కనిపించిన రెడ్ బ్యాగ్ లో ఏముందనేది ఆసక్తికరంగా మారింది. ఈ విషయంపై అధికారికంగా ట్రంప్ కానీ మచాడో కానీ ఏ విషయం వెల్లడించలేదు. అయితే, ట్రంప్ తనకోసం వైట్ హౌస్ కు వచ్చే ప్రత్యేక అతిథులకు ఈ రెడ్ బ్యాగ్ ను గిఫ్ట్ గా అందిస్తారు.
ట్రంప్ రెడ్ బ్యాగ్ లో ఏముంటాయంటే..
- మేక్ అమెరికా గ్రేట్ అగైన్ క్యాప్షన్, ట్రంప్ సంతకంతో కూడిన రెడ్ కలర్ క్యాప్
- 2025 జనవరి 20వ తేదీ ముద్రించిన డైట్ కోక్ బాటిల్
- అమెరికా క్యాపిటల్ భవనం స్కెచ్‌తో, బంగారు అక్షరాలు ముద్రించిన ఎరుపు రంగు లెదర్ డైరీ
- ట్రంప్, జేడీ వాన్స్ బొమ్మలతో కూడిన మెడల్
- వైట్ హౌస్ కీ చైన్, క్రిస్మస్ ఆర్నమెంట్
- ట్రంప్ ముఖచిత్రంతో కూడిన నకిలీ 100 డాలర్ల నోటు
- ఒక చిన్న గోల్డ్ పిన్